పురంధరేశ్వరి గారు ఈ లెక్కల సంగతేంటంటున్న వైసీపీ 

పురంధరేశ్వరి గారు ఈ లెక్కల సంగతేంటంటున్న వైసీపీ 

ఏపీ బీజేపీ( AP Bjp Party ) అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు దగ్గుపాటి పురందరేశ్వరి.

పురంధరేశ్వరి గారు ఈ లెక్కల సంగతేంటంటున్న వైసీపీ 

ఏపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు, ఏపీలో ఎక్కడ అభివృద్ధి చోటు చేసుకోలేదని, కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ,అలాగే కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి ఏపీలో వైసిపి ( Ycp Party )ప్రభుత్వం అమలు చేస్తూ తమవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఇలా అనేక ఆరోపణలు చేశారు.

పురంధరేశ్వరి గారు ఈ లెక్కల సంగతేంటంటున్న వైసీపీ 

అలాగే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అప్పులు బాగా పెరిగిపోయాయని ఎన్నెన్నో ఆరోపణలు చేశారు .

దీంతో పురందరేశ్వరి చేసిన విమర్శలపై వైసిపి కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయింది.

పురందరేశ్వరి చెబుతున్న లెక్కలతో పాటు , వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి,  అప్పులు , గత టిడిపి ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి , అప్పులు తదితర అంశాలపై లెక్కలతో సహా బయటపెట్టి వాటికి సమాధానాలు చెప్పాలని , వాస్తవం ఏంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు 97 వేల కోట్లు గా ఉండగా , 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు దిగిపోయే సమయానికి ఏపీకి ఉన్న అప్పులు 3,62,375 కోట్లుగా ఉన్నాయని,  చంద్రబాబు ( Chandrababu Naidu )చేసిన అప్పు మొత్తం 2,65,365 కోట్లుగా ఉండగా , వైసిపి అధికారంలోకి వచ్చిన జూలై 18 2023 నాటికి ఏపీకి అప్పులు 10,77,006 కోట్లు.

ఈ లెక్కను చూస్తే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 7,14,632 కోట్లు అని పురందేశ్వరి ఆరోపణలు చేయగా దీనికి వైసిపి కూడా లెక్కలను బయటపెట్టింది.

"""/" / రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు - 1,32,079 కోట్లు.

టిడిపి దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు -3,32,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20.

17% ) 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు : 5,87,317 కోట్లు ( 16.

13 శాతం ).రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వరంగ సంస్థల అప్పులు : 1,63,346 కోట్లు టిడిపి దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 4,12,288 కోట్లు ( వార్షిక పెరుగుదల 21.

87% ) 2023 మార్చినాటికి అప్పులు : 6,51,789 కోట్లు.గత టిడిపి ప్రభుత్వ పాలనతో పోలిస్తే వైసిపి ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు తక్కువేనని కాగ్ రిపోర్ట్ చెబుతోందని , మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేసినట్లు వైసిపి చెబుతోంది .

చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 76,139 కోట్లు ఖర్చు చేశారు అంటే ఏడాదికి 15,225 కోట్లు కాగా,  జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలోనే 75,411 కోట్లు ఖర్చు చేశారు.

అంటే సరాసరి ఏడాదికి 18,852 కోట్లు సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు వైసిపి లెక్కలు బయటపెడుతోంది.

ఇక ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లుగా పురందరేశ్వరి విమర్శలు చేయగా , దీనికి సంబంధించిన లెక్కలను బయటపెట్టింది.

గత టిడిపి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పెట్టిన ఖర్చు 3160 కోట్లు, వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు 4,493 కోట్లు.

"""/" / అలాగే ఉద్యోగులకు సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లించలేకపోతుందని పురందరేశ్వరి( Purandhareswari ) విమర్శలు చేయగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్ జీతాల బిల్లు : 23997 కోట్లు, (2021 -22 ఏప్రిల్ - అక్టోబర్ వరకు ) గుజరాత్ 7,789 కోట్లు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు 24,681 కోట్లు గా వైసిపి పేర్కొంది.

అలాగే గత టిడిపి ప్రభుత్వం వదిలేసి వెళ్లిన జెన్కో బిల్లులు,  కాంట్రాక్టర్ల బిల్లులు వంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే .

ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసిపి ప్రభుత్వం పై పురందేశ్వరి ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదని, క్షేత్రస్థాయిలో వైసిపి పాలన ఏ విధంగా ఉందో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నారు.

రాజమౌళి సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్ బాబు?