పింఛన్ పంపిణీ విషయంపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఏపీ రాజకీయం( AP Politics ) మొత్తం పింఛన్ పంపిణీ చుట్టూ తిరుగుతూ ఉంది.
ఎన్నికల నేపథ్యంలో పింఛన్ పంపిణీ ఇంకా ఇతర ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో వాలంటీర్లు( Volunteers ) జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దీంతో అధికారుల ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధాలు జరుగుతున్నాయి.
పేద ప్రజలకు పెన్షన్ అందకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నట్లు అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeswari ) పింఛన్ పంపిణీ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీ విషయం ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. """/"/
సంక్షేమం అనేది నిరంతరాయం.
అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్ధంగా లేదని అడిగారు.పెన్షన్ పంపిణీ( Pension Distribution )లో ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలపై నేపాన్ని నెట్టేస్తున్నారని పురందేశ్వరి సీరియస్ అయ్యారు.
సమర్థవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని నిలదీశారు.2019కి ముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించే వారిని గుర్తు చేశారు.
డిబిటీ( DBT ) ద్వారా పెన్షన్ పంపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏంటని అన్నారు.
పింఛన్లకు సీఎం జగన్( CM YS Jagan ) ఎందుకు బటన్ నొక్కడం లేదని ప్రశ్నించారు.
వాలంటీరే ఎందుకు వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని తెలిపారు.
వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించే పింఛన్ వెనుక ఏం ఆశిస్తున్నారో వెల్లడించాలని పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో భారతీయ జంట పెద్దమనసు .. స్కాలర్‌షిప్ ఫండ్ కోసం భారీ విరాళం