విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని రాష్ట్రంలో ప్రతిపక్షాలు అదే విధంగా అధికార పార్టీ కేంద్రాన్ని కోరుతూ ఉన్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అని విపక్షాలు కేంద్రం అనుసరిస్తున్న విధానంపై వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో గత ప్రభుత్వాలు గనులు ఇవ్వకపోవడం వల్లే.ఇటువంటి పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు.

ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని విమర్శించారు.భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి ప్రభుత్వం రుణాలు తీసుకునే పరిస్థితి దారుణమని అన్నారు.

ఈ క్రమంలో కరోనా వల్ల అప్పులు చేయాల్సి వస్తుందని అనడం సరికాదని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ.ప్రత్యేక హోదా వద్దు అని చెప్పిందన్నారు.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో బీజేపీ స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.సింహాచలం లో పురంధేశ్వరి వ్యాఖ్యలు చేయడం జరిగింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!