వైరల్ : గ్రాండ్ గా కుక్కపిల్ల గృహ ప్రవేశం.. చూస్తే ఆశ్చర్యపోవాలంతే..?

ఈ మధ్యకాలంలో మనుషులు మనుషులను ప్రేమించడం కంటే మూగజీవాల పైన ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నారు.

ముఖ్యంగా ఎంతో ఇష్టపడి పెంచుకొనే పెంపుడు కుక్కలపై ఉండే ప్రేమ అంతా ఇంతా కాదు.

పెంపుడు కుక్కల పై మనుషులకు ఎంత ప్రేమ ఉంటుంది అనేదానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగా మారింది.

ఇక్కడో కుటుంబం కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నారు.ఇందులో కొత్తేముంది అంటారా.

? మామూలుగా మనం మనుషులకి గ్రాండ్ వెల్కం చెప్పడం చూస్తాం.కానీ ఇక్కడ కుటుంబం మాత్రం తాము తెచ్చుకున్న కుక్కపిల్లకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.

ఇంట్లోకి తీసుకెళ్లి ముందు ఏకంగా ఆ కుక్క పిల్లకి బొట్టు పెట్టి.హారతి పట్టారు.

అచ్చంగా మనుషులకు చేసినట్టుగానే ఆ కుక్క పిల్ల కాలి ముద్రలను ఓ వస్త్రం మీద పెట్టారు.

ఇలా ఎంతో గ్రాండ్ గా.ఎవరూ ఊహించని విధంగా.

ఆ కుక్క పిల్లకు గృహప్రవేశం చేయించింది ఆ కుటుంబం.అది కేవలం కుక్కపిల్ల మాత్రమే కాదని తమ ఫ్యామిలీ మెంబర్స్ తో సమానం అని చెప్పుకొచ్చింది ఆ కుటుంబం.

ఇంకేముంది దీన్నంతా వీడియో తీసి బ్యాక్ గ్రౌండ్ లో ఒక అద్భుతమైన సాంగ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.

ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెటిజన్లను ఫిదా చేస్తోంది అనే చెప్పాలి.దీంతో ఈ చిట్టి పప్పీ గృహ ప్రవేశం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ముఖ్యంగా కుక్క గృహప్రవేశానికి.బాక్ గ్రౌండ్ లో యాడ్ చేసిన సాంగ్ కి నెటిజన్లు అందరూ బాగా కనెక్ట్ అయి పోతున్నారు.

దీంతో నెటిజన్లు కూడా ఆ కుక్క పిల్లకు గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతున్నారు.

ఇక ఈ ఘటన కుక్క పిల్లల పై మనుషులు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనే దానికి నిలువుటద్దంగా మారిందనే చెప్పాలి.

త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో కీలక పాత్ర వహించనున్న మలయాళ సూపర్ స్టార్…