ఎన్ఆర్ఐలను ఎగతాళి చేస్తే ఊరుకునేది లేదు: వీడియోలో ఏకిపారేసిన యువతి

భారతదేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.తొలినాళ్లలో ఒకటి ఆరా కేసులు నమోదవ్వగా, ఎన్ఆర్ఐలు ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారో అప్పుడు దేశంలో పరిస్ధితి మారిపోయింది.

వివిధ దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ లేదా ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండాలని చెప్పినప్పటికీ చాలా మంది వాటిని లెక్కచేయకుండా కుటుంబసభ్యులతో పాటు జనాలతో కలిసి తిరిగారు.

దీని కారణంగా దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది.ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రస్తుత పరిస్ధితికి ఎన్ఆర్ఐలే కారణమని పలువురు మండిపడుతున్నారు.

అంతేకాకుండా వారిని కింఛపరిచేలా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన హర్జీత్‌కౌర్ బద్రుఖాన్ ఇటువంటి వారిపై ఫైరయ్యారు.

ప్రధానంగా విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వారి వల్లే కరోనా వ్యాపిస్తుందంటూ ఫేస్‌బుక్, టిక్‌టాక్ ఇతర సోషల్ మీడియా సాధనాల్లో ప్రచారం చేస్తున్న వారిని హర్జీత్ కౌర్ లక్ష్యంగా చేసుకున్నారు.

"""/"/ పంజాబ్‌కు చెందిన ఎంతోమంది ఎన్ఆర్ఐలు యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలోని దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.

కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు మాతృ దేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే లక్ష్యంతో పంజాబ్‌లో విద్య, మందులు, మౌలిక సదుపాయాలు ప్రాజెక్ట్‌లకు తోడ్పాటును అందిస్తున్నారు.

రాష్ట్రానికి ఇంతగా సేవ చేస్తున్న ఎన్ఆర్ఐలను ఎగతాళి చేస్తే ఊరుకునేది లేదని హర్జీత్‌కౌర్ ఓ వీడియోలో ఏకిపారేసింది.

మాతృభాష పంజాబీలో చేసిన ఈ వీడియోలో.ఎన్ఆర్ఐలు దేశం కానీ దేశంలో అవిశ్రాంతంగా పనిచేసి గ్రామాలు, పాఠశాలలు మరియు ఆసుపత్రులకు ఆర్ధిక సాయాన్ని చేస్తున్నారని ఆమె చెప్పారు.

రాష్ట్ర, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న అలాంటి వారిని ఎగతాళి చేస్తున్న వారు సిగ్గుపడాలని హర్జీత్ వ్యాఖ్యానించారు.

టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లలో గడిపేవారికి ప్రతిరోజూ ఓ కొత్త విషయాన్ని వెతుకుతారని.ప్రస్తుతం వారు పంజాబ్‌లోని ఎన్ఆర్ఐ కమ్యూనిటీని టార్గెట్ చేశారని ఆమె మండిపడ్డారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్