ఇంగ్లాండ్‌కు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు… భారత్‌ను శాశ్వతంగా వదిలేశారా..?

దివంగత పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్‌లు యూకే వెళ్లారు.

నవంబర్ 24 వరకు అక్కడే వుండి కుమారుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ‘‘ఇన్సాఫ్ మార్చ్’’లో వారు పాల్గొంటారు.

ఈ విషయాన్ని సిద్దూ మామ చమ్‌కౌర్ సింగ్ సిద్ధూ ధ్రువీకరించారు.తాము ఛండీగఢ్‌ నుంచి ఇంగ్లాండ్‌కు చేరుకుంటామని ఆయన చెప్పారు.

అయితే తన కుమారుడి మరణానికి న్యాయం చేయనందున సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్‌ భారతదేశాన్ని విడిచి వెళ్లిపోతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌పోర్టులో సిద్ధూ తల్లిదండ్రులు కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మూసేవాలా అభిమానులు కలత చెందారు.

అయితే మరో నెలలో తిరిగి భారతదేశానికి వస్తానని బాల్కౌర్ చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల బాల్కౌర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.సిద్ధూ హత్య జరిగి ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు తమ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు.

చట్టంపై తనకు నమ్మకం వుందని.అందుకే ఇప్పటి వరకు ఎదురుచూసినట్లు బాల్కౌర్ తెలిపారు.

అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేకపోవడం తనకు ఆగ్రహం తెప్పిస్తోందని బాల్కౌర్ చెప్పారు.

నవంబర్ 25 లోగా తనకు న్యాయం జరగకుంటే భారత్‌ను శాశ్వతంగా వదిలేస్తామని పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

ఆ తర్వాత విచారణ జరపాల్సిన అవసరం కూడా వుండదని, ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకుంటానని బాల్కౌర్ సింగ్ స్పష్టం చేశారు.

"""/"/ ఇకపోతే.ఈ ఏడాది మే 29న దుండగుల చేతిలో సిద్ధూ మూసేవాలా దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.

దీంతో యావత్ దేశం ఉలిక్కిపడింది.ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పంజాబ్ పోలీసులు.

నలుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇద్దరిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?