కెనడాలో గ్యాంగ్‌వార్.. పంజాబీ గ్యాంగ్‌స్టర్ దారుణహత్య, పెళ్లికి అతిథుల్లా వచ్చి తూటాల వర్షం

కెనడాలో ( Canada ) పట్టపగలు దుండగులు రెచ్చిపోయారు.పెళ్లి వేడుకలోనే ఓ భారత సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ను దారుణంగా కాల్చిచంపారు.

వివరాల్లోకి వెళితే.ఆ దేశంలోని టాప్ 10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడిగా పోలీసులు ప్రకటించిన అమర్‌ప్రీత్ సమ్రా అలియాస్ చిక్కీని( Amarpreet Samra Alias Chucky ) మృతుడిగా గుర్తించారు.

ఇతడిని ప్రత్యర్ధి గ్యాంగ్ ‘బ్రదర్స్ గ్రూప్’’( Brothers Group ) సభ్యులే హత్య చేసినట్లుగా నిర్ధారించారు.

వాంకోవర్ నరగంలోని ఫ్రెష్ వ్యూ హాల్లో జరిగిన పెళ్లి వేడుకకు మృతుడు అమర్‌ప్రీత్ అతని సోదరుడు రవీందర్‌తో కలిసి హాజరయ్యాడు.

అందరితో కాసేపు సరదాగా గడిపి , ఆపై డ్యాన్స్ కూడా చేశాడు అమర్‌ప్రీత్.

అంతా మంచి జోష్‌లో వుండగా.ఉన్నట్లుండి కొందరు సాయుధులు వేదిక వద్దకు చేరుకుని మ్యూజిక్‌ను ఆపాలని హెచ్చరించారు.

ఆ వెంటనే అమర్‌ప్రీత్‌పై తూటాల వర్షం కురిపించారు.అనంతరం అతని కారుకి కూడా నిప్పు పెట్టాడు.

ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.అనంతరం కాసేపటికీ తేరుకుని పోలీసులకు సమచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అమర్‌ప్రీత్‌ను కాపాడేందుకు ఎంతో శ్రమించారు.సీపీఆర్ చేసినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడు.

"""/" / ఇక అమర్‌ప్రీత్, అతడి సోదరుడు రవీందర్‌లు కెనడాలో టాప్ మోస్ట్ గ్యాంగ్‌స్టర్లు.

వీరికి పలు హత్యలు, ఇతర ఘటనలతో సంబంధాలు వున్నాయి.వీరిద్దరూ యూఎన్ గ్యాంగ్ తరపున పనిచేస్తుంటారని బ్రిటీష్ కొలంబియా పోలీసులు వెల్లడించారు.

అయితే అమర్‌ప్రీత్ వర్గానికి , బ్రదర్స్ గ్రూప్ వర్గానికి మధ్య కొన్నాళ్లుగా వైరం వుంది.

ఈ క్రమంలోనే అదనుచూసి అమర్‌ప్రీత్‌ను హత్య చేసింది ప్రత్యర్ధి గ్యాంగ్. """/" / కాగా.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కెనడాకు వెళ్లిన పలువురు భారతీయులు అక్కడ ఉన్నత స్థానానికి చేరుకుని ఇరుదేశాలకు గర్వకారణంగా నిలుస్తుంటే.

కొందరు క్రైమ్ వరల్డ్ వైపు అడుగులు వేసి నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు.వీరిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ.

ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.

ఇప్పటికే పలువురు గ్యాంగ్‌స్టర్‌లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.

లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.