రష్యా సైన్యంలో చేర్చుతామని చెప్పి.. ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిన భారతీయుడు
TeluguStop.com
ఉన్నత విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇటీవలి కాలంలో భారతీయులతో పాటు అన్ని దేశాల వాసులు విదేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.
వీరి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ రంగం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.
కన్సల్టెన్సీలు, ట్రావెల్, వీసా సేవలు, డాక్యుమెంటేషన్, ట్రైనింగ్ తదితర వ్యాపార సంస్థలు ప్రతి చోటా కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి.
వీటిలో ప్రభుత్వ గుర్తింపు వున్న సంస్థలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.మిగిలినవన్నీ భోగస్ సంస్థలే.
ఇలాంటి వారి ట్రాప్‌లో చిక్కుకుంటే పరాయి దేశంలో ఎన్నో ఇబ్బంది పడాల్సి వుంటుందనడానికి నిత్యం ఎన్నో ఉదాహరణలు.
"""/" /
తాజాగా పంజాబ్( Punjab )లోని జలంధర్ నగర శివారులోని గొరయాకు చెందిన వ్యక్తి మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం అర్మేనియా, రష్యాకు వెళ్లి అక్కడి ట్రావెల్ ఏజెంట్లు, హ్యాండ్లర్ల చేతిలో మోసపోయారు.
బాధితుడిని మన్‌దీప్ కుమార్‌గా( Mandeep Kumar ) గుర్తించారు.తమ డబ్బును ఏజెంట్ల నుంచి రికవరీ చేయాలని, తమ బిడ్డను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మనదీప్‌కు పాదంలో శారీరక వైకల్యం కూడా వుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
మన్‌దీప్ 2023 ఆగస్టులో తన ఇద్దరు స్నేహితులతో కలిసి అర్మేనియా( Armenia )కు వెళ్లాడు.
అక్కడ కొద్దినెలలు పనిచేసిన తర్వాత వీరికి మరో ఇద్దరు పరిచయమయ్యారు.ఈ ఐదుగురు కపుర్తలాలోని ఓ ఏజెంట్‌ని ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించారు.
రష్యాకు చేరుకున్నాక వీరికి ఆహారం పెట్టలేదని, కొట్టడంతో పాటు డబ్బు కోసం వేధించేవారని మన్‌దీప్ సోదరుడు జగదీప్ ఆరోపించారు.
మిగిలిన నలుగురు తిరిగి రాగా.మన్‌దీప్ రష్యా( Russia )లోనే ఉన్నాడని చెప్పారు.
మన్‌దీప్‌తో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడగా.తాను రష్యా సైన్యంలో చేరానని, భయంగా ఉందని చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
అతనే కాకుండా మరో 40 మంది పంజాబీ యువకులు కూడా ఉన్నారని వారు వెల్లడించారు.
మన్‌దీప్ సురక్షితంగా వెళ్లేందుకు గాను ఏజెంట్‌కు రూ.35,40,000 పంపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అతనిని ఇటలీకి పంపుతామని హామీ ఇచ్చిన ఏజెంట్లు మాస్కోకు, ఆపై బెలారస్‌కు, అక్కడి నుంచి ఫిన్‌లాండ్‌కు తిప్పి రష్యాకు పశ్చిమాన ఉన్న సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు తీసుకెళ్లారని వెల్లడించారు.
తిండి, నీళ్లు లేకుండా వారిని పెట్రోల్ బంక్ వద్ద వదిలేశారని జగ్‌దీప్ చెప్పారు.
అయితే మన్‌దీప్ కంటే ముందే ఈ ఏడాది మార్చిలో పంజాబ్, హర్యానాకు చెందిన 100 మంది యువకులను రష్యా సైన్యంలో చేర్చుతామని చెప్పి మోసం చేశారు.
న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!