కెనడా : టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పంజాబ్ కుర్రాడి చిత్రం

గతేడాది కెనడాకు( Canada ) మకాం మార్చిన పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన వైభవ్ శర్మ అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్)కి ఎంపికైన ‘‘ఐ యామ్ నో క్వీన్ ’’( I Am No Queen ) అనే మూవీలో ఆయన నటించారు.

సెప్టెంబర్ 8న ఫెస్టివల్‌లో అధికారిక ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు.మినుబాసి, షాదాబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వలస విద్యార్ధులు ఎదుర్కొన్న నిజమైన ఘటనలను ప్రస్తావించారు.

కొత్త దేశంలో సవాళ్లు, కష్టాలను ఎదుర్కొనే రాణి( Rani ) అనే ఓ అంతర్జాతీయ విద్యార్ధి కథను ఇందులో చూపించారు.

వైభవ్ హ్యారీ ( Vaibhav Harry )ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించారు.

ఈ క్యారెక్టర్ రాణి ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.

"""/" / ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.పాత్రను ప్రతిబింబిస్తూ, అంతర్జాతీయ విద్యార్ధుల కష్టాలను ప్రతిధ్వనించే ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు వైభవ్ కృతజ్ఞతలు తెలిపారు.

తమ చిత్రం కొత్త దేశంలో పునరావాసం కోసం సవాళ్లను ఎదుర్కొనే విద్యార్ధుల జీవితాలను ప్రతిధ్వనిస్తుందన్నారు.

ఇందులోని రాణి అనే అమ్మాయి పాత్ర చాలా మంది అంతర్జాతీయ విద్యార్ధుల( International Students ) జీవితాలను ప్రతిబింబిస్తుందని వైభవ్ తెలిపారు.

ఆశలు, కలలతో విదేశాలలో సెటిలవ్వాలనుకునే వారికి కఠినమైన వాస్తవాలను తెలియజేస్తుందన్నారు. """/" / ఐ యామ్ నో క్వీన్‌లో నటించడానికి ముందు వైభవ్.

జెర్సీ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్‌లతో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు.

ది జోయా ఫ్యాక్టర్, ఆపరేషన్ రోమియో, సనక్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు, వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలను వైభవ్ చేశారు.

ముంబైలో ఏడేళ్ల పాటు గడిపిన ఆయన.తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ 2023లో కెనడాలో అడుగుపెట్టారు.

టీఐఎఫ్ఎఫ్‌లో జరగనున్న ప్రీమియర్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని వైభవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!