పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఏడేళ్లుగా లైంగిక బంధం : ఎన్ఆర్ఐపై కేసు, లుకౌట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్
TeluguStop.com
వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన పంజాబ్ యువకుడిపై ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.మోగా నగరంలోని ప్రీత్ నగర్‌లో నివాసం వుంటున్న భూపీందర్ సింగ్ బ్రార్ కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ బ్రార్ ప్రస్తుతం పోర్చుగల్‌లో స్థిరపడ్డాడు.
ఇద్దరికీ తెలిసిన కామన్ ఫ్రెండ్ ద్వారా లవ్‌ప్రీత్‌కు బాధితురాలిలో పరిచయం ఏర్పడింది.ఇద్దరూ యూరప్‌లోనే నివసిస్తున్నందున వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఓ రోజున లవ్‌ప్రీత్ ఆమెకు ప్రపోజ్ చేశాడు.ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలిని లోబరచుకుని శారీరకంగా కలిశాడు.
ఏడేళ్లుగా ఈ తంతు జరుగుతుండగా.గతేడాది లవ్‌ప్రీత్ హఠాత్తుగా ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్లు బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు.
అంతేకాకుండా గతేడాది భారత్‌కు వచ్చి మరో మహిళను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడని లాయర్ చెప్పారు.
"""/" /
లవ్‌ప్రీత్ వివాహం గురించి తెలుసుకున్న బాధితురాలు.తనపై లైంగిక వేధింపులతో పాటు మోసం చేశాడని ఆరోపించింది.
దీనిపై తన లాయర్ ద్వారా మోగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో లవ్‌ప్రీత్ తన వివాహాన్ని రద్దు చేసుకుని, తిరిగి పోర్చుగల్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత లవ్‌ప్రీత్ సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 376, 420, 406 కింద కేసులు నమోదు చేశారు.
"""/" /
అంతేకాకుండా అతని కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశం వుంది.
మరోవైపు.బాధితురాలు పంజాబ్‌లోని లూథియానా జిల్లాకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.
ఆమె ప్రస్తుతం ఇటలీలో నివసిస్తోంది.ఇకపోతే.
మరో కేసులో మోగాకే చెందిన మరో యువకుడు కుల్వీందర్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఎన్ఆర్ఐ మహిళను మోసం చేశాడు.
దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేశారు.