రోడ్డు ప్రమాదంలో 16 మంది హాకీ క్రీడాకారుల మరణం.. భారతీయ ట్రక్క్ డ్రైవర్‌కు దేశ బహిష్కరణ , కెనడా కోర్ట్ కీలక ఆదేశాలు

ఐదేళ్ల క్రితం హంబోల్డ్ బ్రోంకోస్ బస్సు ప్రమాదంలో( Humboldt Broncos Bus Crash ) 16 మంది హాకీ ఆటగాళ్ల మరణానికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్‌ జస్కిరత్ సింగ్ సిద్ధూ( Jaskirat Singh Sidhu ) తనను భారత్‌కు బహిష్కరించడానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ తిరస్కరించినట్లు సీబీసీ న్యూస్ నివేదించింది.

ప్రమాదకరమైన డ్రైవింగ్ ఆరోపణలపై నేరాన్ని అంగీకరించిన ట్రక్ డ్రైవర్ నుంచి వచ్చిన దరఖాస్తులను న్యాయమూర్తి గురువారం తోసిపుచ్చారు.

కెనడాలోనే( Canada ) ఎలాగైనా వుండేందుకు సిద్ధూ ప్రయత్నించి విఫలమయ్యాయడు.నాటి ఘటనలో 16 మంది క్రీడాకారులు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేరానికి గాను 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్ట్.2018 ఏప్రిల్ 6న సస్కట్చేవాన్ హైవే 35, సస్కట్చేవాన్ హైవే 335లోని ఆర్మ్‌లే ఇంటర్‌సెక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

సీబీసీ న్యూస్ ప్రకారం సిద్ధూకు అప్పుడే కొత్తగా పెళ్లయ్యింది.ఇతను తన ట్రక్కుతో సస్కట్చేవాన్‌లోని టిస్‌డేల్ సమీపంలో వున్న రూరల్ జంక్షన్ వద్ద .

జూనియర్ హాకీ జట్టును( Junior Hockey Team ) ప్లే ఆఫ్ గేమ్‌కు తీసుకెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది.

"""/" / ఈ ఏడాది ప్రారంభంలో సిద్ధూకు పెరోల్ మంజూరు చేయగా.కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ( Canada Border Services Agency ) అతనిని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా సిఫారసు చేసింది.

సిద్ధూ తరపున మైఖేల్ గ్రీన్.సెప్టెంబర్‌లో ఫెడరల్ కోర్టు ముందు వాదనలు వినిపించారు.

సరిహద్దు సేవల అధికారులు సిద్ధూకు వున్న క్లీన్ రికార్డ్, పశ్చాత్తాపాన్ని పరిగణించలేదని మైఖేల్ కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసుపై రెండోసారి సమీక్ష నిర్వహించి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేలా ఏజెన్సీని ఆదేశించాలని మైఖేల్ వాదించారు.

అయితే న్యాయమూర్తి మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చారు.ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు పోయాయని, కొందరు జీవచ్చవాల్లా మిగిలి వారి ఆశలు, కలలు చెదిరిపోయాయని ప్రధాన న్యాయమూర్తి పాల్ క్రాంప్టన్( Chief Justice Paul Crampton ) వ్యాఖ్యానించారు.

"""/" / అధికారుల నిర్ణయాన్ని కోర్టు సమర్ధిస్తుందని, ఇది పారదర్శకంగా అర్ధవంతంగా వుందని జస్టిస్ క్రాంప్టన్ రాశాడు.

సిద్ధూ ఇప్పుడు భారత్‌కు బహిష్కరణను ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి తెలిపారు.అయితే మానవతా దృక్పథంతో ఆయనను ఇక్కడ వుండటానికి అనుమతించేలా కోరవచ్చని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

సిద్ధూ బహిష్కరణపై ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన క్రీడాకారుల కుటుంబాలు కూడా స్పందించాయి.

ఒత్తైన జుట్టు కోసం ఆరాట‌పడుతున్న పురుషుల‌కు బెస్ట్ ఆయిల్ ఇది..!