Punjab Polls 2022: ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసిన కాంగ్రెస్.. ప్రవాసుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.

ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో వున్న అధికారాన్ని లాక్కోవాలని ఆప్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

దీనికి తోడు కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని మాజీ సీఎం అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది.

దీనిలో భాగంగా గట్టి అభ్యర్ధులను నిలబెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తనదైన వ్యూహాలతో దూసుకెళ్తోంది.

దీనిలో భాగంగా ఎన్ఆర్ఐలను హస్తం పార్టీ టార్గెట్ చేసింది.వీరిని సంతృప్తిపరిచేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది.

పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ.ఓవర్సీస్ ఇండియన్ కాంగ్రెస్‌ సమావేశంలో భాగంగా ప్రవాస భారతీయులతో చర్చలు జరిపారు.

ఎన్ఆర్ఐల చట్టపరమైన హక్కులను నిర్ధారించడం తమ ప్రాధాన్యత అని సిద్ధూ వారితో చెప్పారు.

అలాగే రాష్ట్రంలో ఎన్ఆర్ఐలకు సంబంధించి 10 వేల కేసులు పెండింగ్‌లో వున్నాయని సిద్ధూ గుర్తుచేశారు.

సమగ్ర విధానాన్ని అవలంభిస్తూ.ఆక్రమణలకు గురైన ఎన్ఆర్ఐల ఆస్తి వివాదాలను విచారించేందుకు ట్రిబ్యూనల్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.

మేనిఫెస్టోలో న్యాయ సహాయ కేంద్రాలు, 24x7 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి భారం లేని ఆస్తి లావాదేవీలను నిర్వహిస్తామని సిద్ధూ .

ప్రవాస భారతీయులకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. """/"/ ప్రభుత్వం వద్ద వివాదాలకు సంబంధించిన సరైన డేటా బేస్ లేనందున.

సింగిల్ విండోలో ఫిర్యాదుల పరిష్కారానికి ఎన్ఆర్ఐ కమీషన్‌ను ఏర్పాటు చేస్తామని సిద్ధూ చెప్పారు.

ఆర్ధిక వివక్ష, వివాహాలకు సంబంధించిన వివాదాలను కూడా ఇందులో చేర్చుతామన్నారు.అంతేకాకుండా ఎన్ఆర్ఐ కార్డ్ సాయంతో ప్రవాసులు.

రాష్ట్ర ప్రభుత్వంతో కనెక్ట్ కావొచ్చని సిద్ధూ తెలిపారు.బహుళ ప్రయోజనాలున్న కార్డ్ సాయంతో ఎన్ఆర్ఐలు ప్రభుత్వం అందించే అన్ని సేవలు.

సౌకర్యాలను పొందవచ్చని ఆయన అన్నారు.ఎన్ఆర్ఐ కార్డుదారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని సిద్ధూ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న పంజాబీ ప్రవాసులకు అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో ఆన్‌లైన్ క్లియరెన్స్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

తద్వారా ప్రవాస భారతీయులు .పంజాబ్‌లో బీపీవోలు, కాల్ సెంటర్‌లు, డేటా సెంటర్‌లు, బ్యాక్ ఎండ్ ఆఫీసులు తెరవొచ్చని సిద్ధూ ఆకాంక్షించారు.

దీని వల్ల పంజాబ్‌లో ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు.

లాస్ ఏంజెల్స్‌లో ఊహించని ప్రాంతంలో ఇల్లు కట్టిన వ్యక్తి.. షాక్‌లో స్థానికులు..?