తండ్రి పంజాబ్‌లో ఏఐజీ .. కెనడియన్ పోలీస్ విభాగంలో కొడుకు, ఇది కదా పుత్రోత్సాహమంటే..!!
TeluguStop.com
కొడుకు పుట్టగానే కాదు.అతని ప్రతిభ గురించి నలుగురు చెప్పినప్పుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అంటారు పెద్దలు.
అలా తండ్రి గర్వపడే స్థాయికి చేరుకున్న కొడుకులకు ఇదే మా సెల్యూట్.సాధారణంగా తండ్రి ఏ ఉద్యోగం / వ్యాపారం చేస్తే కొడుకు కూడా ఆయననే ఫాలో అవుతూ వుంటాడు.
ఈ విషయం ఎందరి జీవితాల్లోనో, ఎన్నోసార్లు రుజువు అయ్యింది.ఇదిలావుండగా.
పంజాబ్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ)గా( Punjab AIG ) పనిచేస్తున్న నరేశ్ డోగ్రా( Naresh Dogra ) కుమారుడు అనీష్ డోగ్రా( Anish Dogra ) కెనడియన్ పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించి రాష్ట్రానికి , దేశానికి గర్వకారణంగా నిలిచాడు.
"""/" /
తన కుమారుడు సాధించిన విజయం పట్ల నరేష్ డోగ్రా హర్షం వ్యక్తం చేశారు.
తన బిడ్డ తనను గర్వపడేలా చేయడమే కాకుండా పంజాబ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా పేరు తెచ్చాడని ఏఐజీ వ్యాఖ్యానించారు.
అంకితభావం, కృషి వల్లనే అనీష్ ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపారు.పంజాబ్ పోలీస్ శాఖలో తాను నిబద్ధతతో పనిచేశానని.
ఇప్పుడు విదేశీ గడ్డపైనా అనీష్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నరేష్ ఆకాంక్షించారు.
"""/" /
ప్రస్తుతం పీఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు నరేష్.చిన్నప్పటి నుంచి తన తండ్రినే చూస్తూ పెరిగిన అనీష్.
తొలుత బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటూ వచ్చాడు.ఈ క్రమంలోనే బాడీ బిల్డింగ్ విభాగంలో ‘‘మిస్టర్ పంజాబ్’’ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
క్రీడల్లో సత్తా చాటుతూనే రూపనగర్ నుంచి బీడీఎస్‌లో పట్టా పొందాడు అనీష్.ఈ నేపథ్యంలో అతనికి అమెరికాకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
అయితే పోలీస్ శాఖలో పనిచేయాలని అనీష్‌కు చిన్నప్పటి నుంచి కల.అందుకోసం అమెరికాకు కాకుండా కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
కెనడాలో( Canada ) కఠినమైన పోలీస్ పరీక్షలో ప్రతిభ కనబరిచి, కెనడియన్ పోలీస్ ఫోర్స్‌లో మంచి పోస్ట్ సంపాదించాడు.
ఏడాది ఇంటెన్సివ్ శిక్షణ తర్వాత .ఆయన మూడు నెలల క్రితం విధుల్లోకి చేరాడు.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?