22 మంది వృద్ధుల‌ను విమానంలో తిప్పాడు...వారి జీవితంలో మ‌రిచిపోలేని ఓ రోజును కానుక‌గా ఇచ్చాడు.!

ఎవరికైనా ఏదైనా ఒక విషయమై ప్రామిస్ చేస్తే దాన్ని నిలుపుకోవడం ఎవరికైనా చాలా కష్టంగానే ఉంటుంది.

కానీ పంజాబ్‌లోని అదంపూర్‌లో ఉన్న సారంగ్‌పూర్ గ్రామానికి చెందిన వికాస్ జ్ఞానికి మాత్రం ఆ విషయంలో ఏ మాత్రం సమస్య ఎదురు కాలేదు.

అతను తాను చేసిన ప్రామిస్‌ను నిలుపుకున్నాడు.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.

వికాస్‌కు ఎప్పటినుంచో పైలట్ కావాలని ఉండేది.చివరకు ఆ కలను అతను సాకారం చేసుకున్నాడు.

దీంతో తమ గ్రామంలో ఉన్న 70 సంవత్సరాలకు పైబడిన వారిని అమృతసర్‌కు విమానంలో తీసుకువెళ్లాలని అనుకున్నాడు.

వారికి నిజంగా అదే మొదటిసారి విమానంలో ప్రయాణించడం.దీంతో వారు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ వికాస్ తండ్రి మహేంద్ర ఇదే విషయమై ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.

తన కొడుకు చేసిన పని తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు.అదే గ్రామానికి చెందిన 90 ఏళ్ల బిమ్లా మాట్లాడుతూ.

తాము మొదటి సారి విమానంలో ప్రయాణిస్తున్నామని, ఇలా ఎప్పుడూ ప్రయాణిస్తామని అనుకోలేదని, పెద్దలకు చాలా మంది పిల్లలు ప్రామిస్ చేస్తారని, కానీ మాట నిలుపుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారని.

ఆమె తెలిపింది.ఇక ఆ గ్రామం నుంచి మొత్తం 22 మంది విమానంలో అమృతసర్‌కు ప్రయాణించారు.

అక్కడి గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్, వాఘా సరిహద్దు తదితర ప్రాంతాలను వారు సందర్శించారు.

ఈ క్రమంలో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.వారిని చూసి విమానంలో ప్రయాణించిన ఇతర ప్రయాణికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మనలో చాలా మందికి విమానంలో ప్రయాణించడం పెద్ద లెక్క కాదు.

కానీ అలాంటి వృద్ధులకు అది వారికి ఒక జీవిత కాలంలో సాధించిన గొప్ప ఘనతగా మారుతుంది.

ఒక అనుభూతిని వారికా ప్రయాణం అందిస్తుంది.వికాస్ తన మాట నిలుపుకుంటూ ఇలా అందరి ముఖాల్లోనూ సంతోషం వ్యక్తం అయ్యేలా చేశాడు.

అంటే.అందుకు అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే కదా.

! .

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు చూసి అలా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?