ఫలించని మోడీ మంత్రం… మిత్రులే శత్రువులా…!
TeluguStop.com
అపర చాణక్యుడిగా పేరొందిన ప్రధాని నరేంద్ర మోడీ.మంత్రం ఫలించడం లేదా ? దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయా ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత పుంజుకుంటోందా ? ఇక, బీజేపీయేతర రాష్ట్రాల్లో మోడీని విలన్ గా చిత్రీకరించాలనే ప్రయత్నం జరుగుతోందా ? అంటే.
ఔననే అంటున్నారు పరిశీలకులు.తాజాగా తమిళనాడు, కేరళ, ఆంధ్ర (పైకి జగన్ ఏమీ మాట్లాడడం లేదు కానీ, వ్యతిరేకత ఉంది), తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రస్థాయిలో మోడీపై విరుచుకుపడుతున్నారు.
"""/"/
దీనికి కారణం ఏంటి ? ఎందుకు ఈ రేంజ్‌లో మోడీ హవా దిగజారిపోతోంది ? నిన్న మొన్నటి వరకు ఆయన వ్యూహాలను, ఆయన నేతృత్వాన్ని కొనియాడిన, ఇలాంటి ప్రధాని అవసరం అని వేనోళ్ల ప్రశంసించిన తమిళనాడు సీఎం పళనిస్వామి, ఏపీ సీఎం జగన్ వంటివారుకూడా తీవ్రస్థాయిలో మోడీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా ప్రధాని మోడీపై విమర్శలు సంధిస్తున్నారు.
ఇక, మిగిలిన వారు మౌనంగా ఉన్నప్పటికీ.మీడియాకు లీకులు ఇస్తున్నారు.
`ప్రధాని ఇలా చేస్తారని అనుకోలేదు.ఇలా అయితే, రాష్ట్రాల పరిస్థితి దారుణం` అంటూ.
సదరు సీఎంలు పరోక్షంగా నిప్పులు చెరుగుతున్నారు. """/"/
ఇక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సీఎం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మోడీ ఘనకార్యంపై వారు మౌనంగా ఉన్నప్పటికీ.ఎక్కడ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని భయం వ్యక్తం చేస్తున్నా.
వారు కూడా మోడీపై అసహనంగా ఉన్నారనేది వాస్తవం.ఇంతకీ .
ఇంత వ్యతిరేకతకు కారణం ఏంటనేది పరిశీలిస్తే.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దీంతో రాష్ట్రాలకు ప్రాణాధారమైన పన్నుల ఆదాయం తగ్గిపోయింది.ఈ నేపథ్యంలో జీఎస్టీ చట్టం ప్రకారం.
కేంద్ర ప్రభుత్వమే సదరు పన్నుల నష్టాన్ని తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలి.ఇది దాదాపు 2.
56 లక్షల కోట్ల రూపాయలు ఉంది.కానీ, కేంద్రంలోని మోడీ సర్కారు ఈ నిదులను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
పైగా మీరు అప్పులు చేసుకోండి అవసరమైతే.మేమే హామీ ఉంటాం.
మీ అప్పుల పరిమితిని కూడా పెంచుతాం అంటూ.ఉచిత సలహాలు ఇస్తోంది.
దీంతో ఆయా రాష్ట్రాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే మేం అప్పుల పాలయ్యాం.
ఇంకా మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా అప్పులు చేసుకోమని సలహాలిస్తారా ? అంటూ.వారు ఫైర్ అవుతున్నారు.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.ఆయన లేఖను సంధించడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
ట్రెడిషనల్ లుక్ లో దీపావళి సెలబ్రేషన్స్ లో సమంత.. ఫోటోలు వైరల్!