ఎన్నారైల డిపాజిట్ల పై భారీ ఆఫర్ ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్...

విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు తమ వద్దనున్న తమ బ్యాంక్ లో డిపాజిట్ల రూపంలో దాచుకోవచ్చునని అందుకోసం డబ్బు మార్పిడి చేయాల్సిన అవసరం లేదని డాలర్ల రూపంలోనే డబ్బు తమ వద్ద డిపాజిట్ చేసుకోవచ్చంటూ ప్రవాసులకు భంపర్ ఆఫర్ ప్రకటించింది.

అయితే విదేశీ కరెన్సీ ద్వారా డబ్బును నిల్వచేసే క్రమంలో FCNR (B) ఖాతాను తెరువడం వలన మీరు డాలర్ల రూపంలోనే డబ్బులను డిపాజిట్ చేయవచ్చునని తెలిపింది.

ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేసిన PN బ్యాంక్ అందుకు సంభందించిన వివరాలను తమ వెబ్ సైట్ లో చూసుకోవచ్చునని తెలిపింది.

అసలు FCNR (B) అంటే ఏమిటి.PNB ఇచ్చిన ఆఫర్ వలన కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలలోకి వెళ్తే.

ప్రవాసుల డిపాజిట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఖాతానే FCNR ( ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ ఎకౌంట్) దీని ద్వారా విదేశీ కరెన్సీ ద్వారా ఈ ఖాతా నిర్వహించబడుతుంది.

అయితే PNB ద్వారా నేరుగా ప్రవాసులే ఈ ఖాతాలను ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు.

అమెరికా డాలర్, పౌండ్ స్టెర్లింగ్, ఆస్త్రేలియన్ డాలర్, కెనడా డాలర్, ఇలా ఐదు దేశాలకు చెందిన డాలర్ల ను ఇందులో డిపాజిట్లు గా ఉంచుకోవచ్చు.

ఈ ఖాతాలో నిల్వ ఉంచిన డబ్బును ఏడాది నుంచీ ఐదేళ్ళ కాలపరిమితి వరకూ నిర్వహించుకోవచ్చు.

ఈ ఖాతాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన ఏ శాఖ నుంచైనా నిర్వహించుకోవచ్చు.

ఈ ఖాతాను తెరువడం వలన ఎన్నారైలకు ఉపయోగం ఏంటంటే.విదేశీ కరెన్సీలో తెరవబడిన ఖాతాలో డబ్బును ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు.

ఈ ఖాతాలో ఉన్న డిపాజిట్ల పై విదేశీ కరెన్సీలలో ఋణాలను PNB కి చెందిన కరస్పాండెంట్ బ్యాంక్ ల ద్వారా భారత్ వెలుపల కూడా పొందవచ్చు.

ఈ డిపాజిట్ల పై ఎలాంటి సంపద, అలాగే ఆదాయపు పన్ను వర్తించదు.ఈ డిపాజిట్లపై వడ్డీ కాలపరిమితి ఏడాది పాటు పూర్తయిన తరువాత మాత్రమే ఉంటుంది.

ఈ ఖాతాలపై ఎలాంటి సందేహాలు, సలహాలు కావాలన్నా తమను సంప్రదించవచ్చునని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది PNB.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని