మోడీ జీ .. మీ ఫ్రెండ్‌తో మాట్లాడండి, భారతీయుల బహిష్కరణపై పంజాబ్ మంత్రి

తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించడం ఇప్పుడు భారత్ - అమెరికాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.

104 మంది భారతీయులతో కూడిన యూఎస్ మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దిగిన సంగతి తెలిసిందే.

అమెరికా( America ) నుంచి బహిష్కరించబడిన వారిలో 30 మంది పంజాబ్‌కు( Punjab ) చెందినవారు కాగా.

33 మంది హర్యానా, మరో 33 మంది గుజరాత్‌లకు చెందిన వారు.ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు చండీగఢ్‌కు చెందినవారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"""/" / ఇలా ఉన్నపళంగా భారతీయులను( Indians ) తరలించడంపై పలు ఎన్ఆర్ఐ సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి.

ఈ వ్యవహారంపై పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( NRI Minister Kuldeep Singh Dhaliwal ) స్పందించారు.

భారతీయులను బహిష్కరించడంపై ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) తక్షణం తన మిత్రుడు , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

ట్రంప్ నా స్నేహితుడని మోడీ పలుమార్లు చెప్పుకున్నారని.2019 సెప్టెంబర్‌లో అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ తరపున మోడీ ప్రచారం కూడా చేశారని కుల్దీప్ సింగ్ ధాలివాల్ కోరారు.

ఇవి అంతర్జాతీయ సమస్యలని, వాటిని ఆ స్థాయిలో చర్చించి పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

"""/" / అమృత్‌సర్ విమానాశ్రయంలో పలువురు బాధితులతో ధాలివాల్ మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బహిష్కరించబడిన వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ జరుగుతోందని , వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన మీడియాకు తెలిపారు.

పంజాబ్‌కు చెందిన వారి డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని.ఆ తర్వాత హర్యానా, గుజరాత్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ నిర్వహిస్తామని ధాలివాల్ చెప్పారు.

వీరే కాకుండా అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీయుల మెడపై బహిష్కరణ , జైలు శిక్ష అనే కత్తి వేలాడుతోందని.

ట్రంప్‌తో మోడీ కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు.అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు దోహదపడిన వీరికి శాశ్వత నివాసం మంజూరు చేయాలని కుల్దీప్ సింగ్ చెప్పారు.