హర్యానాలో పంజాబీ ఎన్ఆర్ఐ జంటపై దాడి.. బాత్రూమ్‌లో దాక్కోకుంటే ..!!

పంజాబ్‌కు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబంపై( NRI Family ) హర్యానాలో( Haryana ) దాడి జరగడం కలకలం రేపుతోంది.

ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Minister Kuldeep Singh Dhaliwal ) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు.

జలాలాబాద్‌లోని చిమ్నేవ్లా గ్రామానికి చెందిన రైతు నాయకుడు మాస్టర్ బూటా సింగ్.( Master Boota Singh ) ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన భార్య సుఖ్‌విందర్ కౌర్‌ను( Sukhwinder Kaur ) రిసీవ్ చేసుకోవడానికి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు.

రోహ్‌తక్ - సిర్సా రోడ్డులో వెళ్తుండగా తమ కారుపై దుండుగులు దాడి చేశారని.

దీంతో పెట్రోల్ బంక్‌లోని బాత్‌రూమ్‌లో దాక్కొని దంపతులిద్దరూ తమ ప్రాణాలను కాపాడుకున్నారని ధాలివాల్ వెల్లడించారు.

ఈ మార్గంలో ప్రయాణించే ఎన్ఆర్ఐల భద్రతను పరిరక్షించాలని.నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీకి లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని హర్యానా డీజీపీని ధాలివాల్ కోరారు.ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన మంత్రి.

ఎన్ఆర్ఐ దంపతులను( NRI Couple ) క్షేమంగా స్వగ్రామానికి చేర్చిన కారు డ్రైవర్‌కు లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.

"""/" / కాగా.కొద్దిరోజుల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లో పంజాబీ ఎన్ఆర్ఐ జంటపై అక్కడి స్థానికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్( Zero FIR ) నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ దగ్గరుండి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.అమృత్‌సర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

"""/" / ఇంగ్లాండ్‌లో ఉంటున్న ఎన్ఆర్ఐలతో పాటు పంజాబ్ పర్యటనకు వచ్చిన బాధితుడి సోదరుడు జోబంజిత్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసును చంబాలోని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు.

మరోవైపు.ఎన్ఆర్ఐ జంటపై తమ రాష్ట్రంలో దాడి జరగడాన్ని ఖండించారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీర్ సింగ్ సుఖు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

కల్కి మూవీకి 32వ రోజు అన్ని వేల టికెట్లు తెగాయట.. ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరో ఉన్నారా?