ప్రియుడిని పెళ్లాడాలన్న కోరికతో ఈ యువతి చేసిన పని అసలే ఊహించరు.. ?
TeluguStop.com
ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలి అనుకున్నారుగా అందుకే మోసాలు చేయడంలో కూడా ఆరితేరుతున్నారు.
ఒక మహిళలే కాదు యువతులు కూడా ఏకంగా చట్టాలనే తప్పుతోవ పట్టించే స్దాయికి చేరుకున్నారు.
ఇక ఇలాంటి ఘటనలు క్రమక్రంగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలు తెలుసుకుంటే.పంజాబ్ పరిధిలోని జలంధర్ లో నిషు ద్వివేదీ అనే 20 ఏళ్ల యువతి, గత కొంతకాలంగా ఓ యువకుడి తో ప్రేమలో ఉందట.
అయితే ఆ యువకునితో ఏకాంతంగా గడపడానికి సమయం చిక్కక ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట.
హోటల్లో అతనితో కలసి ఉండాలంటే, ఎవరికీ అనుమానం రాకుండా చూసు కోవాలని, అందుకు తన పక్కనే పాప ఉంటే బాగుంటుందని భావించి తమ బంధువులకు చెందిన ఓ మూడేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసింది.
అయితే, పాప కనిపించక పోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా జలంధర్ లోని ఓ హోటల్ లో ఉన్న వీరిద్దరినీ గుర్తించి, పాపను రక్షించారు.
ఇక తాను ఆ పాపను కిడ్నాప్ ఎందుకు చేసిందో చెప్పగా ఆ మాటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు, వారిద్దరిపై కిడ్నాప్ తో సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన విచారణ జరుపుతున్నారట.
ఏది ఏమైన ప్రియుడితో గడపాలనే కోరిక తప్పుడు ఆలోచన పుట్టేలా చేసి చివరికి కటకటాల పాలు చేసింది ఆ ప్రేమికులను.
మిస్ యూ మై సన్.. ప్రముఖ కమెడియన్ గీతా సింగ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!