ఆ దేశంలో దొంగతనాలకు, అక్రమ సంబంధాలకు ఎలాంటి శిక్షలుంటాయో తెలుసా?
TeluguStop.com
ముస్లీం దేశాలైన దుబాయి ఇంకా అరబ్ దేశాలు అత్యంత దారుణమైన కఠిన శిక్షలను నేరస్తులకు అమలు చేస్తుంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎంతో దారణమైన శిక్షలు అమలు అయ్యే ఆయా దేశాల్లో నేరాల శాతం చాలా తక్కువగా ఉంటుంది.
కొన్ని ముస్లీం దేశాల్లో అఘాయిత్యంకు నడి రోడ్డు మీద ఉరి శిక్ష అమలు చేస్తున్న విషయం తెల్సిందే.
ఇంకా కొన్ని దేశాల్లో తల నరకడం కూడా చేస్తారు.అయితే అవి కాస్త పెద్ద నేరాలకు శిక్షలు.
కాని ఆసియాలోనే చిన్న దేశం అయిన బ్రూనైలో అత్యంత కఠినమైన శిక్షలు అమలు అవుతున్నాయి.
రాచరికపు పాలన కొనసాగుతున్న ఆ దేశంలో తాజాగా స్థానిక ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది.
దొంగతనాలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో కొత్త శిక్షలు అమలులోకి తీసుకు వచ్చారు.కొత్త శిక్షల ప్రకారం దొంగతనం చేసి మొదటి సారి దొరికన వారికి కుడి చేయి నరికేస్తారు.
మరోసారి దొంగతనం చేస్తా కాలు కూడా నరికేస్తారు.ఒక వ్యక్తి మూడవ సారి కూడా దొంగతనం చేస్తే తలకాయ నరికేయాలనే కొత్త శిక్షలు అమలు అవుతున్నాయి.
ఇంలాంటి వింతైన శిక్షలు అమలు అవుతున్న ఆ దేశంలో ఇతర నేరాలకు కూడా అత్యంత కఠినంగా శిక్షలు అమలు అవుతున్నాయి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
స్వలింగ సంపర్కులు, అక్రమ సంబంధాలను పెట్టుకున్న వారిని నడి రోడ్డు మీద కట్టేసి చనిపోయే వరకు రాళ్లతో కొట్టి చంపడం.
ప్రభుత్వం వారిని విచారించి వారు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా నిరూపిస్తే అప్పుడు రోడ్డు మీదకు తీసుకు వచ్చి జనాలతో రాళ్లతో కొట్టిస్తారు.
అక్రమ సంబంధాల వల్ల ఎక్కువ నేరాలు జరుగుతాయని భావించిన స్థానిక రాజు ఇలాంటి విభిన్నమైన శిక్షను అమలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి ముస్లీం దేశంతో పాటు చిన్న దేశం అయిన బ్రూనైలో కూడా ఇలాంటి శిక్షలు ఉండటం అభినంద నీయం.
ఇంతగా కాకుండా ఇండియాలో కూడా ఇలాగే శిక్షలు ఉంటే బాగుండేది అనేది కొందరి వాదన.
ఏసీబి వలలో మరో అవినీతి ఆర్ఐ చేప