రక్తం చిందిస్తున్న రాజకీయం

ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత అలా ఎన్నుకోబడిన రాజేకీయ నాయకులకే( Political Leaders ) ఉంటుంది .

ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన నాయకులు తమ ప్రవర్తన ద్వారా మాట తీరు ద్వారా ప్రజల శ్రేయస్సు కాంక్షించాలి .

వినిపిస్తున్న ప్రతీ నినాదం వేనుకా ఎవరో ఒకరి ప్రయోజనం ఉంటుందని తెలియని అమాయక జనం మధ్యలో సమీదలగా మారి రక్తం చిందిస్తున్నారు.

రోజురోజుకీ దిగజారిపోతున్న నైతిక విలువలతో రాజకీయాలంటేనే ఒక ఆదిపత్యపు పోరుగా తయారయింది .

తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేనొకటంటా అంటూ ఒకరు ఒకరిని మించి ఒకరు దిగజారుడు భాష ఉపయోగించటంతో రాజకీయ సభలు సమావేశాలు సెన్సార్ చేయబడాల్సిన స్థాయికి దిగజారిపోయాయి .

"""/" / అతి విలువైన ప్రజా సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవలసిన అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ రాయడానికి వీలు లేని భాషను ఉపయోగిస్తూ ఆ వ్యవస్థ తాలూకు విలువను బ్రష్టు పట్టిస్తున్నారు.

అయితే ఇప్పుడు మరింత కిందకి దిగి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు కూడా పాల్పడటం రాజకీయాల్లో విలువలను భూతద్దంలో వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది .

ఈరోజు పుంగనూరులో( Punganuru ) తెలుగుదేశం వైసీపీ శ్రేణులు మధ్య బాహా బాహీతోపాటు రాళ్లు రువ్వుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తలు సామాన్య ప్రజలతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది.

"""/" / ముందుగా పర్మిషన్ తీసుకోకపోవడం వల్లే రక్షణ కల్పించలేకపోయామంటూ పోలీసు వర్గాలు చెబుతుంటే పోలీసుల ఉద్దేశపూర్వకంగా వైసిపి కార్యకర్తలకు( YCP ) సమాచారం ఇచ్చి మరి మాపై దాడి జరిగేలా చేశారంటూ తెలుగుదేశం వర్గాలు( TDP ) ఆరోపిస్తున్నాయి.

ఈ మొత్తంఘటన లో తప్పు ఎవరిది అయినప్పటికీ ఉద్రేకాలు రెచ్చగొట్టుకోవడాలతో సాధించే ప్రయోజనం ఏమి ఉండదని ఇరువర్గాలు గమనిస్తే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉంటాయి.

రాజకీయాలకు అతీతంగా పనిచేసే స్వేచ్ఛను చట్టాన్ని అమలు చేసే సంస్థలకు ఇచ్చినప్పుడు మాత్రమే ఫలితాలు నిష్పక్షపాతంగా ఉంటాయి ఆధిపత్యం అన్నది ఎన్నికల ద్వారానే నిరూపించుకోవాలి తప్ప ఇలా ప్రత్యక్ష దాడులకు దిగితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు .

పద్మశ్రీ అవార్డులపై రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు…మనకు రావు అంటూ?