Puneeth Rajkumar Ashwini Revanth : విధి విడదీసిన ఈ అందమైన జంట ప్రేమకథ ఒక్కసారి తెలుసుకోండి !
TeluguStop.com
కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా వెలుగొందిన పునీత్ రాజ్‌కుమార్( Puneeth Rajkumar ) 2021లో అకాల మరణం చెందాడు.
అతడి మరణాన్ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోయింది.చనిపోయినప్పుడు ఈ హీరో వయసు కేవలం 46 ఏళ్లే.
ఈ మరణం వల్ల అందరికంటే ఎక్కువగా భార్య అశ్విని రేవంత్( Ashwini Revanth ) కృంగిపోయింది.
పునీత్, అశ్విని అన్యోన్యమైన వైవాహిక జీవితాన్ని గడిపారు.ఒకరు లేకపోతే మరొకరు లేరు అన్నట్లుగా వారి అనుబంధం పెనవేసుకుపోయింది.
నిజానికి వీరు గాఢంగా ప్రేమించుకుని డిసెంబరు ఒకటి 1999లో పెళ్లి చేసుకున్నారు.అప్పటినుంచి పర్ఫెక్ట్ కపుల్‌గా నిలుస్తూ వచ్చారు.
ఎంతో ఆనందంగా జీవిస్తున్న వారి పై విధి చిన్నచూపు చూసింది.పునీత్ చనిపోవడం అశ్వినికి తీరని శ్లోకాన్ని మిగిల్చింది.
పెళ్లికాకముందు చదువు పూర్తి అయిన తర్వాత పునీత్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అశ్వినిని కలుసుకున్నాడు.
వారిద్దరూ కలిసి రెండు మూడు, సంవత్సరాల దాకా గడిపారు.తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టమని గ్రహించారు.
ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని తెలుసుకున్నారు.పెళ్లికి ఎనిమిది నెలల ముందు పునీత్ తన జీవిత భాగస్వామి అశ్విని అని డిసైడ్ అయ్యాడు.
ఆమె కూడా తన ఇష్టాన్ని తెలపడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.నిజానికి అశ్విని కుటుంబ సభ్యులు( Ashwini Family ) ఆరు నెలల దాకా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు.
పునీత్ తల్లిదండ్రులకు కూడా కాస్త సందేహించారు.పునీత్ తల్లి పార్వతమ్మ త్వరగానే ఒప్పుకున్నారు.
చివరికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వీరికి పెళ్లి చేశారు. """/" /
పునీత్ కుటుంబ విలువలను తెలుసుకొని వారిలో కలిసి పోవడానికి అశ్వినికి కొంత సమయం పట్టింది.
తర్వాత వారిలో ఒకరైపోయి మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది.ప్రతి వీకెండ్ ఈమె చేసే స్వీట్స్‌ను మామయ్య రాజ్‌కుమార్( Rajkumar ) చాలా ఇష్టంగా తినే వాడట.
అయితే అశ్విని వేరే వాళ్ళ సినిమాలు పెద్దగా చూడకపోయినా పునీత్ సినిమాలు( Puneeth Movies ) మాత్రం చూసి హానెస్ట్ గారి రివ్యూ ఇచ్చేదట.
అశ్విని బెస్ట్ క్రిటిక్స్‌లో ఒకరని పునీత్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు.బతికున్న కాలంలో ఈ హీరో "పీఆర్‌కే" బ్రాండ్‌ను ప్రారంభించాడు.
అయితే ఈ బ్రాండ్ స్థాపించడం అశ్విని ఆలోచనే అని అంటారు. """/" /
ఈ ముచ్చటైన జంటకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
వారి పేర్లు ధ్రుతి, వందిత.అశ్విని సహృదయురాలు, వినయశీలు అని సన్నిహితులు తెలుపుతుంటారు.
2021లో అక్టోబర్ 29న గుండెపోటుతో పునీత్ మరణించడం వల్ల అశ్విని గుండె పగిలింది.
అతడి లేని లోటును ఆమె నిత్యం గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుందని తెలుస్తోంది.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్