ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!

దేశంలో ఐటీ రంగం పరిస్థితి ఏమీ బాగాలేదు.ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.

కంపెనీలు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నాయి.ఒకవేళ ఉద్యోగం ఇద్దామన్నా, టాలెంట్ ఉంటేనే తీసుకుంటున్నారు.

ఈమధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్( Viral Video ) అయింది.

ఆ వీడియో చూస్తే షాక్ అవుతారు.పుణెలోని( Pune ) మగర్‌పట్టాలో ఉన్న యూపీఎస్ దగ్గర వేల మంది ఇంజనీర్లు క్యూ కట్టారు.

ఒకే ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏకంగా 3,000 మందికి పైగా ఇంజనీర్లు రోడ్డు మీద నిలబడి ఎదురుచూశారు.

పుణె పల్స్ అనే ట్విట్టర్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది."పుణెలో ఇంటర్వ్యూ కోసం 3,000 మంది ఇంజనీర్లు క్యూ.

ఐటీ జాబ్( IT Jobs ) మార్కెట్ ఎంత టఫ్ గా ఉందో చూడండి" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.

వీడియోలో మగవాళ్లు, ఆడవాళ్లు అందరూ ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు.అసలు ఏ ఉద్యోగం కోసం అంత మంది వచ్చారో తెలీదు కానీ, వీడియో మాత్రం బాగా వైరల్ అయింది.

"""/" / ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు."ఇది మామూలు వేధింపు కాదు.

కన్సల్టింగ్ జాబ్స్‌కి ఇంత హడావిడి అవసరమా? మంచి రెజ్యూమ్ చూసి ఉద్యోగం ఇవ్వండి.

పనిచేయకపోతే తీసేయండి" అని ఒక యూజర్ కామెంట్ చేశారు."2015లో నేను కూడా పుణెలో సీటీఎస్ ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఇదే సీన్" అని ఇంకొకరు చెప్పారు.

చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకపోవడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు."నిరుద్యోగం( Unemployment ) ఎంత పెరిగిపోయిందో చూడండి.

చాలామందికి భవిష్యత్తు లేదు.తల్లిదండ్రులు డబ్బులు పోసి చదిదిస్తున్నా వేస్ట్" అని ఇంకొక యూజర్ బాధపడ్డారు.

"""/" / ఇలాంటి వీడియోలు రావడం ఇదేం మొదటిసారి కాదు.అక్టోబర్‌లో కెనడాలో వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల కోసం కూడా వేల మంది భారతీయులు క్యూ కట్టారు.

టొరంటోలోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ దగ్గర స్టూడెంట్స్ గంటల తరబడి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశారు.

చదువు ఉన్నా, టాలెంట్ ఉన్నా ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతోంది.

పెళ్లి తర్వాత కొత్త సినిమా ప్రకటించిన మెగా కోడలు…. ఫోటోలు వైరల్!