ముడతలను పోగొట్టి స్కిన్‌ను టైట్‌గా మార్చే గుమ్మడి గింజలు..ఎలాగంటే?
TeluguStop.com
వయసు పెరిగే కొద్ది శరీరంలో వచ్చే మార్పుల కారణంగా చర్మం సాగి ముడతలు పడుతుంటాయి.
దాంతో ముసలి వారిగా కనిపిస్తుంటారు.అందుకే చాలా మంది వయసు పెరిగినా ముడతలను దాచేయాలని తెగ ప్రయత్నిస్తుంటారు.
ఈ క్రమంలోనే ఖరీదైన క్రీములు, మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా ముడతలను నివారించుకోవచ్చు.
అందుకు గుమ్మడి గింజలు అద్భుతంగా సమాయపడతాయి.గుమ్మడి గింజల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు ముడతలను పోగొట్టి సాగిన చర్మాన్ని టైట్‌గా మార్చగలవు.
మరి గుమ్మడి గింజలను ఎలా స్కిన్‌కి యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బౌల్‌లో ఒక స్పూన్ గుమ్మడి గింజలు, అర కప్పు రోజ్ వాటర్ వేసుకుని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత రోజ్ వాటర్‌తో సహా మెత్తగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక స్పూన్ అలోవెర జెల్, కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
అపై ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.రోజూ ఇలా చేస్తే ముడతలు క్రమంగా పోయి చర్మం టైట్‌గా మరియు గ్లోగా మారుతుంది.
అలాగే రెండు స్పూన్ల గుమ్మడి గింజలను తీసుకుని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిలో ఒక స్పూన్ గుమ్మడి గింజల నూనె, ఒక స్పూన్ తేనె మరియు రెండు స్పూన్ల పచ్చి పాలు పోసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసి ఇరవై నిమిషాల అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా ముడతలు పోయి చర్మం యవ్వనంగా మెరుస్తుంది. """/" /
ఇక గుమ్మడి గింజలను చర్మానికి పూసుకోవడమే కాదు.
ఆహారంలో భాగంగా కూడా చేర్చుకోవాలి.రోజూ గుప్పెడు గుమ్మడి గింజలను తీసుకుంటే.
అందులో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు చర్మంపై ముడతలు ఏర్పడకుండా చేస్తాయి.
ఒకవేళ ముడతలు ఉన్నా వాటిని పోగొట్టి స్కిన్‌గా అందంగా మెరిపిస్తాయి.
ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?