ఒకప్పుడు కన్నీటి కష్టాలు.. ఇప్పుడు నాసాలో ఉద్యోగం.. పులివెందుల కుర్రాడి సక్సెస్ స్టోరీకి ఫిదా కావాల్సిందే!
TeluguStop.com
ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ దక్కిన సమయంలో కలిగే ఆనందం మరెప్పుడూ దొరకదు.
కొంతమంది జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సక్సెస్ సాధించడంతో పాటు కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు.
కడపలోని పులివెందుల కుర్రాడు హర్షవర్ధన్ రెడ్డి( Harsha Vardhan Reddy ) ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం నాసాలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఎన్నో కన్నీటి కష్టాలను అనుభవించిన హర్షవర్ధన్ ప్రస్తుతం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఎన్ని కష్టాలు ఎదురైనా ఏదో ఒక సందర్భంలో అనుకూల ఫలితాలు వస్తాయని టాలెంట్ ఉంటే ఆపడం ఎవరి తరం కాదని హర్షవర్ధన్ రెడ్డిప్రూవ్ చేశారు.
కడప జిల్లాకు( Kadapa ) చెందిన ఈశ్వర్ రెడ్డి, శివపార్వతి దంపతుల స్వస్థలం పులివెందుల కాగా పదేళ్ల క్రితం కడప నుంచి గుంటూరుకు వెళ్లి వాళ్లు స్థిరపడ్డారు.
ఈ దంపతుల పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి పులివెందులలో పదోతరగతి వరకు చదువుకున్నారు.
"""/" /
హైదరాబాద్ లో ఇంటర్ పూర్తి చేసిన హర్షవర్ధన్ జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్( Mechanical Engineering ) చదివారు.
బీటెక్ లో సిల్వర్ మెడల్ సాధించిన హర్షవర్ధన్ కు ఓ.ఎన్.
జీ.సీ సంస్థ సిల్వర్ మెడల్ తో పాటు లక్ష రూపాయల స్కాలర్ షిప్ ఇచ్చింది.
బీటెక్ మూడో సంవత్సరంలో ఇంటర్న్ షిప్ కోసం కెనడా వెళ్లిన హర్షవర్ధన్ రెడ్డి పీహెచ్డీ చేయాలని అనుకున్నా కుటుంబ సమస్యల వల్ల ఆ కల నెరవేరడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
"""/" /
అయితే కన్న కలను నెరవేర్చుకోవాలని భావించిన హర్షవర్ధన్ రెడ్డి ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఏరో స్పేస్ లో పీహెచ్డీ జాయిన్ అయ్యి నాసాలో( NASA ) జాబ్ కు ఎంపికయ్యారు.
గత నెల 10వ తేదీన కాలిఫోర్నియాలోని నాసా ఫీల్డ్ సెంటర్ లో హర్షవర్ధన్ రెడ్డి ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టారు.
హర్షవర్ధన్ రెడ్డి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!