మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవికి పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం( Gambhiraopet ) కేంద్రంలోని ఆదర్శ మున్నూరు కాపు సంఘం మేకర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడవరోజు అన్నపూర్ణాదేవి( Annapurna Devi ) అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు , అమ్మవారికి పూలతో కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది.

పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మంగళ హారతులతో పూజలు నిర్వహించారు.మున్నూరు కాపు సంఘంనకు చెందిన మాలదారులు, మహిళలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాలదారులు మెకార్తి శ్రీనివాస్ దేశెట్టి నవీన్ దేశెట్టి రాజ శేఖర్, మెకార్తి హనుమన్ రాజ్,గంద్యడపు స్వామి నేతికుంట సతీష్ మెకార్తి( Satish ) భాస్కర్ అక్కపల్లి సంతు ఎర్ర చెర్రీ ఎర్ర జస్సు తదితరులు పాల్గొన్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్…