100 టెస్ట్ మ్యాచ్ లు పూర్తి చేసుకోనున్న పుజారా.. లక్ష్య సాధనలో పడ్డ కష్టాలు తెలుసా..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ తో 100 టెస్ట్ మ్యాచ్ లు పూర్తిచేసుకోనున్న పూజారా.

13 ఏళ్లుగా భారత బ్యాటింగ్ లో రాణిస్తూ, ఆస్ట్రేలియా బౌలర్లు అవుట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా భారత టీంకు అడ్డుగోడలా నిలబడి రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇప్పటికే ఈ అరుదైన రికార్డును 12 మంది సాధిస్తే తాజాగా వందో టెస్ట్ మ్యాచ్ ఆడి,100 టెస్ట్ మ్యాచ్ లు పూర్తి చేసుకున్న 13వ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.

ఇది అందరూ ఆటగాళ్లకు సాధ్యం కాదు.టీ 20, వన్డే మ్యాచ్ లలో ఎన్ని పరుగులు చేసినా కూడా టెస్ట్ మ్యాచ్ లలో ఆడి నిలబడడం కొందరికే సాధ్యం.

తాజాగా ఆ జాబితాలో పూజారా చేరనున్నాడు. """/"/ ఇక 2010లో ఆస్ట్రేలియా పై తొలి మ్యాచ్ ఆడిన పూజారా ఆఫ్ సెంచరీ తో నిలిచాడు.

ఇక వందో మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా తో ఆడి పూర్తి చేసుకొనున్నాడు.ఇక టెస్ట్ మ్యాచ్ కెరీర్ లో ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్ లలో 19 సెంచరీలు 34 ఆఫ్ సెంచరీలతో 7021 పరుగులు సాధించి తనకంటూ ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నాడు.

"""/"/ ఇక ఇతని జీవితంలో ట్విస్ట్ ఏమిటంటే ఇతడికి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అక్టోబర్ 9 2005న ఇతని తల్లి క్యాన్సర్ తో చనిపోయారు.

ఐదు సంవత్సరాల అనంతరం 2010 అక్టోబర్ 9న పూజారా తొలి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడడం జరిగింది.

తొలి ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగులు చేశాడు.రెండో ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అంతేకాకుండా 2018-19 సిరీస్ లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో మూడు సెంచరీలు పూర్తి చేసి 521 పరుగులు సాధించడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు.

ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా తోనే 100 టెస్ట్ మ్యాచ్ ఆడుతుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంచలన పోస్ట్ చేసిన పూనమ్ కౌర్… దెబ్బకు దిగివచ్చిన డిప్యూటీ సీఎం!