Salaar Trailer : సలార్ మూవీకి కేజీఎఫ్ కు ఉన్న పోలికలు ఇవే.. ఆ విషయంలో సేమ్ టు సేమ్ అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్( Salaar ) మూవీ డిసెంబర్ 22న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

ఎట్టకేలకు సలార్ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

విడుదలైన గంటల వ్యవధిలోని రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టింది.దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కేజిఎఫ్ సినిమా తర్వాత తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

"""/" / అంచనాలకు తగ్గట్టుగా తాజాగా ట్రైలర్ ని విడుదల చేయగా ట్రైలర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ మదర్.

ఇక్కడ ఫ్రెండ్.మిగతాది అంతా సేమ్ టు సేమ్ అంటూ ప్రతి ఒక్కరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కెజియఫ్‌ మూవీలో తల్లికి ఇచ్చిన మాట కోసం ఒక సామ్రాజ్యాన్ని శాసిస్తే, ఇక్కడ ఫ్రెండ్‌ కోరాడని ఒక సామ్రాజ్యాన్ని ఇవ్వడం కోసం ఎగేసుకుని వెళ్లిపోతున్నట్లుగా ప్రభాస్‌( Prabhas ) ని చూపించారు.

కెజియఫ్, సలార్‌లో సేమ్ టు సేమ్ అనేలా చాలా పోలికలు కనిపిస్తున్నాయి.విలన్ కోటలోకి ఎవరూ రాకూడనే ఆంక్షలు, ఒక పిల్లాడు చాలా గంభీరమైన కంఠంతో మాట్లాడటం ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి.

"""/" / అలాగే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండా కూర్చోబెట్టడం, విలన్లు కనిపించిన తీరు, గుడిసెలు, మిలటరీ వెహికల్స్‌తో నిండిన ఇండస్ట్రీయల్ ఏరియా ఇలా చాలా పోలికలు ఈ ట్రైలర్‌లో గమనించవచ్చు.

అలా మొత్తంగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే కేజీఎఫ్ సినిమానే చూసినట్టుగా అనిపిస్తోంది అంటున్నారు ప్రేక్షకులు.

సినిమా ట్రైలర్ ని చూసిన ఇంకొంతమంది నెటిజన్స్ అసలీ సినిమాలో హీరో ప్రభాసా? లేక పృథ్వీరాజా? అని కూడా డౌట్స్ వ్యక్తం చేస్తుండటం విశేషం.

డైరెక్టర్ బాబీ తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తున్నాడు..?