వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజా భద్రత చర్యలు తప్పనిసరి.

తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ లో భాగంగా 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే సంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి.

వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా :వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజా భద్రత చర్యలు తప్పనిసరి అని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(measures) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్-2013 ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధిలో 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే వ్యాపార, వాణిజ్య సంస్థల్లో(కమర్షియల్ భవనాలు,షాపింగ్ మాల్స్,ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్,మొదలగు.

) సంస్థల్లో వద్ద సీసీ కెమెరాలు తప్పని సారిగా అమర్చుకోవాలన్నారు.సీసీ కెమెరాల యొక్క డేటా 30 రోజుల వరకు భద్రపరిచే విధంగా పరికరాలు అమర్చుకోవాలని, భద్రపరిచిన డేటాను నేరాల నియంత్రణలో భాగంగా అవసరమున్న సందర్భల్లో సంబంధించిన అధికారులకు అందజేయాలన్నారు.

ప్రతి ఆరు నెలలకోకసరి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుదని,తనిఖీల సమయంలో సీసీ కెమెరాలు లేకున్నా, ఉన్న సీసీ కెమెరాలు పని చేయకున్న సంబంధిత యజమాని పై తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎంఫైర్స్మెంట్ యాక్ట్ ప్రకారం15,000/- రూపాయల జరిమాన విధించడంతో పాటు అవసరమైతే అట్టి వ్యాపార, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన లైసెన్స్ లను రద్దుకు సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు.

చైనాలో ఘోర యాక్సిడెంట్.. స్కూల్ పిల్లలపైకి దూసుకెళ్లిన బస్సు.. 11 మంది మృతి..