ప్రజా సమస్యలు పరిష్కరించాలి:సిపిఎం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూనూతనకల్ మండలం చిల్పకుంట్ల సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో శనివారం ఎంపీడీవో ఇందిరకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం మండల సిపిఎం కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి( Kandala Shankar Reddy ) మాట్లాడుతూ చిల్పకుంట్ల గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.
నూతనకల్ నుండి చిల్పకుంట్ల మీదిగా సంగెం గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలని, రైతులందరికీ రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీంల( SIX GuaranteeS Schemes )ను అర్హులైన పేదలందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తొట్ల లింగయ్య,బత్తుల సోమయ్య,బొజ్జ శ్రీను, గజ్జల కృష్ణారెడ్డి,కూసు సైదులు,బాలగాని సోమయ్య,కూసు బాలకృష్ణ,తొట్ల హరీష్, ఎల్లంల నరేష్,ఊసు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో వైరల్.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్