బాలుడి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ పిచ్చి…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు.అయితే ఇందులో ముఖ్యంగా టిక్ టాక్, పబ్జి గేమ్ వంటి వాటికి అయితే ఇప్పటికే కొందరు బానిసలై అవి లేకుండా ఉండలేక పోతున్నారు.
తాజాగా ఓ 13 సంవత్సరాలు కలిగినటువంటి బాలుడిని తన తల్లి పబ్జి గేమ్ ఆడొద్దని మందలించినందుకు గాను ఆ బాలుడు ఏకంగా తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నభవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక హైదరాబాద్ నగరంలో వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడికి 13 సంవత్సరాలు కలిగినటువంటి బాలుడు ఉన్నాడు.ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో బాలుడు ఇంటిపట్టునే ఉంటూ చరవాణికి బానిసయ్యాడు.ఇందులో భాగంగా నిత్యం పబ్జి గేమ్, టిక్ టాక్ వంటివి చూస్తూ ఉండేవాడు.
దీంతో అప్పుడప్పుడు తన తల్లి మొబైల్ ఫోన్ పక్కన పెట్టి చదువుకోవాలని చెబుతూ ఉండేది.
అయినప్పటికీ బాలుడు వినకుండా యధావిధిగా మొబైల్ ఫోన్ వాడుతూనే ఉన్నాడు.ఈ మధ్యకాలంలో పబ్జి గేమ్ కారణంగా మొబైల్ ఫోన్ వాడకం మరింత ఎక్కువైంది.
దీంతో తాజాగా బాలుడు పబ్జి గేమ్ ఆడుతుండగా బాలుడి నుంచి తన తల్లి మొబైల్ ఫోన్ లాగేసుకుంది.
అంతేగాక ఇంకోసారి మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడొద్దంటూ మందలించింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి బాలుడు వెంటనే తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకేశాడు.
ఇది గమనించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా రక్తపుమడుగులో బాలుడు శవమై కనిపించాడు.
దీంతో బాలుడు తల్లిదండ్రులు బోరున విలపించారు.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.
అలాగే కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకొని ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?