అనంతపురం జిల్లాలో దారుణం.. మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో దంపతుల దారుణ హత్య..!

దంపతులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తి కొడవలితో విచక్షణారహితంగా నరకడం వల్ల ఆ దంపతులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో అనంతపురం జిల్లా( Anantapuram District ) యాడికి మండలం నిట్టూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే గ్రామస్తులు ప్రతి దాడి చేసి మతిస్థిమితం లేని నిందితుడిని హతమార్చారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.నిట్టూరు గ్రామంలో బాలరాజు (52),( Balaraju ) సుంకమ్మ (45)( Sunkamma ) అనే దంపతులు నివాసం ఉంటూ రజక వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.ఈ దంపతులు శుక్రవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రసాద్( Prasad ) అనే మతిస్థిమితం లేని వ్యక్తి అర్ధరాత్రి అటువైపుగా వెళుతూ కొడవలితో బాలరాజుపై దాడి చేశాడు.

పక్కనే ఉన్న భార్య సుంకమ్మ అడ్డుకునే ప్రయత్నం చేసింది. """/" / కానీ మతిస్థిమితం లేని ప్రసాద్ చేతిలో కొడవలి ఉండడం, విచక్షణ రహితంగా దాడి చేయడం వల్ల ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే దాడి సమయంలో సుంకమ్మ దగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉండే ప్రజలంతా మేల్కొని వచ్చేసరికి దారుణం జరిగిపోయింది.

"""/" / అనంతరం నిందితుడు గ్రామస్తులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు.కొడవలితో రమణయ్య( Ramanaiah ) అనే వ్యక్తి ను గాయపరిచాడు.

ప్రసాద్ ప్రాణాలతో ఉంటే మతిస్థిమితం లేని కారణంగా గ్రామంలో ఒంటరిగా తిరిగే వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉంటుందని భావించిన గ్రామస్తులంతా ప్రసాద్ పై రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు.

తీవ్ర గాయాలైన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.తర్వాత గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌..అతి తక్కువ ఖర్చుతో ఏకంగా 180 రోజుల వ్యాలిడిటీ