కరోనా దెబ్బకు కథే మార్చిన పవన్
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన పవన్, తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టాడు.
ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన 27వ చిత్రాన్ని ప్రారంభించిన పవన్, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు.
అయితే కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో చిత్ర షూటింగ్‌లు అన్నీ వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలో పవన్ 27వ చిత్రమైన ‘విరూపాక్ష’లో కూడా భారీ మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా క్లైమాక్స్‌ను క్రిష్ మొరాకోలో భారీ ఎత్తున ప్లాన్ చేశాడు.కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చే పనిలో పడ్డాడట క్రిష్.
ప్రస్తుతం ఇతరదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడం మంచిది కాదని భావించిన క్రిష్, దానికి తగ్గట్టుగా కథ క్లైమాక్స్‌ను మార్చే పనిలో పడ్డాడు.
పవన్ కూడా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ను ఇండియాలోనే పూర్తి చేసేలా చూడాలని క్రిష్‌ను కోరాడట.
తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ నటిస్తుంది.
రైలు కంపార్ట్‌మెంట్‌లో ఇబ్బందికర సమస్య.. చిటికెలో ఫిక్స్ చేసిన మహిళ.. వీడియో చూస్తే..!