అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు.. పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అంబటి రాంబాబును ఇమిటేట్ చేయడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే బ్రో సినిమా సక్సెస్ మీట్ లో పృథ్వీరాజ్( Prudhvi Raj ) మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదని పృథ్వీరాజ్ అన్నారు.శ్యాంబాబు రోల్ కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని నాకు తెలియదని ఆయన తెలిపారు.
నా క్యారెక్టర్ ఎందుకంత వైరల్ అయిందని సముద్రఖని అడిగారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.బ్రో మూవీలో మంచి ఉందని టైమ్ వాల్యూ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ రీజన్ వల్లే ఇంత కనెక్ట్ అయిందని చెప్పానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని పృథ్వీరాజ్ అన్నారు.
"""/" /
ఎంత సంపాదించినా చివరికి మట్టిలోకే వెళ్లాలని జీవించి ఉన్న సమయంలో ఆనందంగా ఉండాలని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
నా పాత్ర పొలిటికల్ వివాదం అయిందని సినిమా చూసిన చాలామంది ఏపీ మంత్రిని డీగ్రేడ్ చేశారని అడుగుతున్నారని ఆ మంత్రి పేరు అంబటి రాంబాబని( Abati Rambabu ) చెబుతున్నారని ఆయన ఎవరో నాకు తెలియదని పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"""/" /
తెలియని వ్యక్తిని నేను ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన పేర్కొన్నారు.
టైం లేదనకూడదని అహంకారం ప్రదర్శించకూడదని ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.బ్రో సినిమా( Bro Movie ) తర్వాత పృథ్వీరాజ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.
పృథ్వీరాజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.పృథ్వీరాజ్ వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!