Prudhvi Raj : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన పృథ్వీరాజ్.. కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం అంటూ?

తెలుగు సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్( Comedian Prudhvi Raj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి నటుడుగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు పృథ్వీరాజ్.

కాగా ఈయన ఇటీవలే విడుదలైన బ్రో సినిమా( Bro Movie )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఈయన నిడివి తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు కూడా దుమారం రేపాయి.

రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. """/" / పృథ్వీరాజ్‌ పోషించిన శ్యాంబాబు పాత్ర( Shyam Babu Role ).

ఇది ఇలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ కి మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చింది.

ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ స్వయంగా చెప్పుకొచ్చారు.ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోని షేర్ చేశారు.

ఆ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చారు.ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఒక బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, ఆయన చేయబోయే సినిమా శోభన్‌బాబు సినిమా( Shoban Babu )లో రెండు గంటలు ఉంటాడు.

ఇది నాకు అద్భుతమైన అవకాశం.ఆ రచయిత, దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాను? తదితర వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.

అది నా కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అవుతుంది. """/" / ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీ అంటూ సెల్ఫీ వీడియోని షేర్ చేశారు పృథ్వీ రాజ్.

ఇటీవలె పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan ), సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన బ్రో సినిమాలో నటుడు, కమెడియన్‌ పృథ్వీరాజ్ శ్యాంబాబు పాత్రలో తళుక్కున మెరిశారు.

ఆ సినిమా విడుదలైన దగ్గరి నుంచి శ్యాంబాబు పాత్రకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ గా మారింది.తనను కించపరిచేందుకే ఆ పాత్ర పెట్టారంటూ స్వయానా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు.

అయితే, చిత్ర బృందం ఎక్కడా ఆ పాత్ర అంబటి రాంబాబుది అని చెప్పకపోవడం గమనార్హం.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters