రెచ్చిపోతున్న పెట్రోల్ బంక్ మాఫియా

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెట్రోల్ బంక్ మాఫియా రెచ్చిపోతుంది.బంక్ నిర్వాహకులు పెట్రోల్,డీజిల్ కృత్తిమ కొరత సృష్టించి వాహనదారులకు షాకిస్తున్నరు.

నకిరేకల్ పట్టణంలో బుధవారం బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పెట్టి మరీ స్టాక్ లేదని చెబుతుంటే అధికారులు మాత్రం జిల్లాలో పెట్రోల్,డీజిల్ కొరత లేదని చెబుతున్నారు.

అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కృత్తిమ కొరత సృష్టిస్తున్న బంకు యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు చెబుతున్న దానికి, బంక్ యాజమాన్యాలు చెబుతున్న దానికి పొంతన లేదని,అసలు ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.