పోలీసుల కాల్పుల్లో యువకుడి మృతి: భగ్గుమన్న మిన్నెసోటా
TeluguStop.com
ఓ వ్యక్తిని పోలీస్ అధికారి కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నిర్వహించిన ర్యాలీతో మిన్నెసోటా అట్టుడికింది.
శనివారం రాత్రి 10.30 ప్రాంతంలో బ్రియాన్ క్వినోన్స్ అనే 30 ఏళ్ల యువకుడిని రిచ్‌ఫీల్డ్, ఎడినా పోలీసులు వెంబడిస్తున్నారు.
ఆ సమయంలో బ్రియాన్ తన మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి ఈ తతాంగాన్ని లైవ్ ఇచ్చాడు.
ఆ వీడియోలో ఒక కారులోంచి క్వినోన్ కిందకు దూకాడు.ఆ సమయంలో అతని చేతిలో తుపాకి వుంది.
బ్రియాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు అతనిపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు.ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కాల్చిన బుల్లెట్ క్వినోన్స్ శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ సన్నివేశాన్ని ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మృతుడి కుటుంబసభ్యులు, కొందరు స్నేహితులు చూశారు.
"""/"/
దీనిని నిరసిస్తూ బ్రియాన్ క్వినోన్స్ కుటుంబసభ్యులు, పౌరులు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.
అనంతరం ఏడు గంటలకు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీగా బ్రియాన్‌ను కాల్చిన ప్రదేశానికి చేరుకుని.
పోర్ట్‌ల్యాండ్ అవెన్యూ వద్ద ఐ-494 హైవేను దిగ్భందించారు.దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీనిపై స్పందించిన పోలీస్ శాఖ కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు కొన్ని వివరాలను విడుదల చేశారు.