సిపిఎం నేతపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా

సిపిఎం నేతపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా

సూర్యాపేట జిల్లా: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులుపై, మహిళలపై దాడి చేసిన మోతె ఎస్ఐ మహేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.

సిపిఎం నేతపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా

శనివారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతె పోలీస్ స్టేషన్ ముందు అనంతరం తాహాసిల్దార్ కార్యాలయం ముందు వేరువేరుగా ధర్నా నిర్వహించారు.

సిపిఎం నేతపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోతె మండలం విభలాపురం, అప్పన్నగూడెం గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు ఇవ్వకుండా అర్హత లేని వారికి ఇచ్చారని అన్నారు.

ఈ విషయమై అనేకసార్లు జిల్లా కలెక్టర్,తాహాసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి, వినతిపత్రం సమర్పించినప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై అర్హులకు ఇవ్వకుండా అర్హతలేని వారికి అమ్ముకున్నారని ఆరోపించారు.

విభలాపురం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు,మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డితో పాటు మహిళా కార్యకర్తలపై మోతె ఎస్సై,బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

కేసులకు సిపిఎం కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు.స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తక్షణమే కలుగజేసుకొని అర్హులకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గత నెల రోజులుగా వివిధ రూపాల్లో పేదలు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కేంతవరకు సిపిఎం పార్టీ పేదలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఐ వీర రాఘవులు మాట్లాడుతూ వెంటనే విచారణ చేసి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తాహాసిల్దార్ సోమపంగు సూరయ్యకు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు,మట్టిపెళ్లి సైదులు,కోట గోపి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు,సిపిఎం మండల కమిటీ సభ్యులు నాగం మల్లయ్య,కిన్నెర పోతయ్య,బూడిద లింగయ్య, కుంచం గోపయ్య,నాయకులు వెలుగు మధు,సోమగాని మల్లయ్య,ములుకూరి సాగర్ రెడ్డి,నాయకులు బోర్రాజు ఎల్లయ్య, కంకణాల శీను, కాశబోయిన వీరమ్మ, తురక రమేష్,బాపనపల్లి నాగయ్య,తురక రమేష్, పులిగుజ్జు ఉప్పమ్మ, పొడపంగి సింధు, పేరుమల్ల నాగమణి, కల్లేపల్లి సుగుణమ్మ,సండ్ర రమణ తదితరులు పాల్గొన్నారు.

దారుణం.. టెల్సా కారుతో ముగ్గురిని చంపేసి, జోకులేసిన యువకుడు..