ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నిరసన సెగ..!!
TeluguStop.com
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి( AP Deputy CM Narayana Swamy ) నిరసన సెగ తగిలింది.
పెనుమూరు మండలం( Penumuru Mandal ) గుంటుపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ ఊరికి రావద్దు అంటూ రాళ్లు మరియు ముల్లకంచెలు వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి ముళ్లకంచెలను తొలగించారు.ఇదే సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటనలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ సలహాదారు జ్ఞానందర్ రెడ్డి వర్గానికి చెందిన వాళ్లు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
"""/" /
పరిస్థితి ఇలా ఉండగా గత కొంతకాలంగా జ్ఞానందర్ రెడ్డి ( Gnanandar Reddy ) మరియు నారాయణస్వామి మధ్యవర్గ పోరు నడుస్తుందట.
ఇదే సమయంలో నారాయణస్వామి కార్యక్రమాలకు జ్ఞానేందర్ రెడ్డి దూరంగా ఉంటున్నారట.ఈ క్రమంలో గుంటుపల్లి గ్రామంలో( Guntupally Village ) నారాయణస్వామి పర్యటన నేపథ్యంలో తమ గ్రామానికి రావొద్దు అంటూ ఫ్లెక్సీలు మరియు ముల్లకంచెలు ప్రభుత్వ సలహాదారు జ్ఞానందర్ రెడ్డి వర్గం అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా పోలీసులు సకాలంలో రావటంతో.పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు.
అయితే చిత్తూరు జిల్లాలో సొంత పార్టీలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వాతావరణం ఉండటంతో వైసీపీ పార్టీలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
అలాంటి ప్రశ్నలు మాత్రం అస్సలు అడగొద్దు.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!