మంత్రి గంగుల కమలాకర్ కు నిరసన సెగ

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురైంది.కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లబుత్కూరులో దళితులు నిరసనకు దిగారు.

తమ గరామంలో ఒక్కరికి కూడా దళితబంధు రాలేదంటూ మంత్రి గంగులను నిలదీశారని తెలుస్తోంది.

ఈ క్రమంలో మంత్రి గంగుల వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న దళితులు బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో నిరసనకారులను కరీంనగర్ రూరల్ పోలీసులు అడ్డుకున్నారు.దళితుల నిరసనలతో అర్హులందరికీ దళితబంధు అందజేస్తామని మంత్రి గంగుల హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?