యాదాద్రిలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ…!

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నిరు హరీష్ రావుకు స్థానిక దళితుల నుండి నిరసన సెగ తగిలింది.

శంకుస్థాపన చేసిన వెళుతున్న మంత్రిని దళితులు అడ్డుకొని తమ భూములను గుంజుకొని ఆసుపత్రి కడుతుండ్రు బాగానే ఉంది.

కానీ,ఏ ఆధారం లేని మా బతుకుల సంగతి ఏంటని ప్రశ్నించారు.గత ప్రభుత్వం తమకు జాగాలు ఇస్తే మీకు ఓటేసి రెండుసార్లు అధికారం ఇచ్చినందుకు మా నెత్తిన మన్ను పోస్తారా అంటూ దళిత మహిళలు నిలదీశారు.

కనీసం వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయగా అది తీసుకొని కొద్దిసేపు ఆగి తమ అవేదన వినకుండా, ఎలాంటి భారోసా ఇవ్వకుండానే మంత్రి హరీష్ రావు అక్కడిని వెళ్ళిపోయారని బాధితులు వాపోయారు.

తమ ప్రాణాలు పోయినా సరే ఈ భూములు వదులుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

వామ్మో, ఈ పాము స్కూటర్‌లో ఎక్కడ నక్కిందో చూస్తే..!