ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేశ్ కు నిరసన సెగ

ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేశ్ కు అసమ్మతి సెగ తగిలింది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు మంత్రి ఆదిమూలపు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో మంత్రి ఆదిమూలపు వైఖరిపై కొండెపికి చెందిన నేత రవిరెడ్డి వర్గీయులు మండిపడ్డారు.

కార్యక్రమానికి ముందుగా వచ్చిన తమను మంత్రి కలవలేదని, కానీ అశోక్ రెడ్డి వర్గానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు.

దీంతో మంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తికి గురైన రవిరెడ్డి వర్గం నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయని మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.తాము స్టేజీపైకి రాగానే మంత్రి ఆదిమూలపు కిందకు దిగిపోయారని ఆరోపించారు.

అప్పుడు మావయ్య బలంగా హత్తుకొని ముద్దుపెట్టారు.. సాయితేజ్ కామెంట్స్ వైరల్!