బీజేపీ నేత బండి సంజయ్కు నిరసన సెగ
TeluguStop.com
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నిరసన సెగ తగిలింది.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం గిర్నితండాలో చేదు అనుభవం ఎదురైంది.
మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్ ను గిర్నితండా వాసులు, గిరిజన సంఘాల నేతలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కాన్వాయ్ ను అడ్డగించిన నిరసనకారులు బండి సంజయ్ పరామర్శకు మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు.
ప్రీతి మరణంపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?