ప్రోటీన్ కోసం గుడ్డునే కాదు.. ఇవి కూడా తినొచ్చు తెలుసా?

మ‌న శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో `ప్రోటీన్` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

అయితే ఇటీవ‌ల కాలంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ ప‌డుతున్నారు.ఈ ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ముఖ్యంగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం, పెరుగుద‌ల లేక‌పోవ‌డం, గుండె బ‌ల‌హీనంగా మార‌డం, మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డం, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందుకే ప్రోటీన్ లోపాన్ని నివారించుకోవ‌డం చాలా అవ‌స‌రం.ఇక ప్రోటీన్ లోపానికి చెక్ పెట్టేందుకు చాలా మంది గుడ్డునే డైట్‌లో చేర్చుకుంటారు.

ఎందుకంటే, గుడ్డులో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.కానీ, గుడ్డు కొంద‌రికి అస్స‌లు ప‌డ‌దు.

దాంతో గుడ్డును దూరం పెడ‌తారు.అయితే ప్రోటీన్ కేవ‌లం గుడ్డులో కాదు.

ఇత‌ర ఆహారాల్లో కూడా స‌మృద్ధిగా ఉంటుంది.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌న్నీర్‌లో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.త‌గిన మోతాదులో ప్ర‌తి రోజు ప‌న్నీర్‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే.

శ‌రీరానికి చ‌క్క‌ని ప్రోటీన్ అందుతుంది. """/" / అలాగే ఓట్స్‌లో కూడా ప్రోటీన్ స‌మృద్ధిగా ఉంటుంది.

అందువ‌ల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్మీల్, ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ ఉప్మా ఇలాంటివి తీసుకుంటే ప్రోటీన్ ల‌భించ‌డంతో పాటు శ‌రీరానికి ఎంతో శ‌క్తి కూడా ల‌భిస్తుంది.

న‌ట్స్ ముఖ్యంగా వాల్ న‌ట్స్‌, బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు వంటి వాటిలో ప్రోటీన్ ఉంటుంది.

అందువ‌ల్ల‌, రెగ్యుల‌ర్‌గా ఈ న‌ట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే.ప్రోటీన్ లోపానికి చెక్ పెట్ట‌వ‌చ్చు.

ప్రోటీన్ బెస్ట్ ఫుడ్‌లో శ‌న‌గ‌లు కూడా ముందుంటాయి.శ‌న‌గ‌లు నాన‌బెట్టి మెుల‌క‌లు వ‌చ్చాక తీసుకుంటే.

మీకు ప్రోటీన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.ఇక వీటితో పాటు వేరు శ‌న‌గ‌లు, ​పెసరపప్పు, సోయా బీన్స్‌, చికెన్‌, పాలు, పెరుగు, చిక్కుడు జాతి గింజ‌లు, గుమ్మడి గింజలు, పాప్ కార్న్‌, అవోకాడో, చేప‌లు వంటి వాటిలో కూడా ప్రోటీన్ స‌మృద్ధిగా ఉంటుంది.

Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఒకే నెలలో తారక్, చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?