జుట్టుకు ప్రోటీన్ ప్యాక్‌.. నెల‌కు 3 సార్లు ట్రై చేస్తే పొడ‌వాటి ఒత్తైన కురులు మీసొంతం!

జుట్టుకు ప్రోటీన్ ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు.జుట్టు దృఢంగా ఉండాల‌న్నా, ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాల‌న్నా ప్రోటీన్ ఎంతో అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే.జుట్టుకు స‌హజంగానే ప్రోటీన్ అందుతుంది.

మ‌రి లేటెందుకు ఆ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసి పెట్టుకోవాలి.

అలాగే ఒక క‌ప్పు కొబ్బ‌రి ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుండి కొబ్బ‌రి పాల‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బ‌రి పాలు, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌ల పొడి వేసి చిన్న మంట‌పై ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించుకోవాలి.

"""/"/ ఈ ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని పూర్తిగా చ‌ల్లార‌నిచ్చి.అప్పుడు అందులో రెండు గుడ్డు ప‌చ్చ సొన‌లు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.

నెల‌కు మూడు సార్లు ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మ‌రియు కురులు సిల్కీగా, షైనీగా మెరుస్తాయి.

సో.త‌ప్ప‌కుండా ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేయండి.

మంచి ఫ‌లితాలు మీసొంతం అవుతాయి.

నాకేం తక్కువ అక్కినేని, ఎన్టీఆర్ లాగా నాకు ఫొటోస్ కావాలి అంటూ రేలంగి చేసిన పని తెలిస్తే !