తెలంగాణలో మహిళలకు రక్షణ కరువు..: డీకే అరుణ

బీఆర్ఎస్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

ఇసుక, భూ దందాలు, 30 శాతం కమిషన్ ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు.అయినా వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.

బీసీలకు పెద్దపీట అని బీసీలకు 22 సీట్లే ఇచ్చారని తెలిపారు.ముదిరాజ్ లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని వెల్లడించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్న డీకే అరుణ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని తెలిపారు.

నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!