భారత రాజ్యాంగాన్ని రక్షించండి:గద్దర్

సూర్యాపేట జిల్లా:భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే నినాదంతో మునుగొడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాను.

కానీ, పోటీ చేయలేక పోయినందుకు ప్రజలు మన్నించాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్ వేడుకున్నాడు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చే నిందలకు తన మౌనమే సమాధానమని, మౌనంతోనే నిందలను జయిస్తానని తెలిపారు.

మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానమని మునుగొడులో రాజ్యాంగాన్ని రక్షించి ప్రజాస్వామ్యానికి ప్రాణంపోయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని రక్షించడంలో నవతరం,యువతరం ముందుండాలని విజ్ఞప్తి చేశారు.