గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడండి:వేమూరి

సూర్యాపేట జిల్లా:మునగాల మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ,దేవాదాయ, వక్ఫ్ బోర్డు,అసైన్డ్,చెరువు శిఖం,గ్రామకంఠం భూములను కాపాడాలని సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ మునగాల తహసిల్దార్ ఆంజనేయిలుకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో వివిధ రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయని,ఏళ్ల తరబడి వాటికి లెక్కాపత్రం లేకపోవడంతో భూ స్వరూపం మారిందని,కొన్ని గ్రామాల్లో అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామాల్లోని అన్ని రకాల ప్రభుత్వ భూములను సర్వే చేసి,హద్దురాళ్ళు పాతి, భూముల వద్ద సర్వే నెంబర్లు, విస్తీర్ణంతో సహా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి,గ్రామ పంచాయతీ,దేవాలయాల వద్ద ఆ వివరాలను గోడ బోర్డులపై బహిరంగపరచి అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్లు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలాన్నారు.

గ్రామాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధికి, అదేవిధంగా గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు ఏర్పాటుకు అవసరమైన మేరకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోని,మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.

హిందూ మతాన్ని నమ్మడం వేరు.. వాడుకోవడం వేరు..పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?