Okra Farming : బెండ పంటను సాలీడు పురుగుల బెడద నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

బెండ పంటకు( Okra Crop ) తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులు టెట్రానిచస్ జాతికి చెందినవి.

ఈ పురుగులు ఎరుపు రంగులో ఉంటాయి.వసంత కాలంలో ఆడ పురుగులు బెండ మొక్క ఆకు కింద గుడ్లు పెడతాయి.

సాలీడు పురుగులు పొడి, అధిక వేడి వాతావరణం లో హాయిగా జీవిస్తాయి.ఈ పురుగులకు అనేక కలుపు మొక్కలు అతిధి మొక్కలుగా వ్యవహరిస్తాయి కాబట్టి ఈ పురుగుల వల్ల బెండ పంటకు ఊహించని నష్టం కలిగి అవకాశం ఉంది.

బెండ మొక్క ఆకుల పై( Okra Leaves ) భాగం తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు మొదట కాంస్యంగా కనిపించి తెలుసుగా మారితే ఆకుకు ఈ సాలీడు పురుగులు ఆశించినట్టే.

ఆకు ఈనెల మధ్య కత్తిరించబడి ఆ తర్వాత ఆకులు రాలిపోతాయి.ఆకు అడుగు భాగంలో సాలీడు గుడ్లను గమనించవచ్చు.

తెగులు సోకిన మొక్కలను సాలెపురుగులు( Spider Mites ) వెబ్ స్పిన్ ద్వారా కప్పేస్తాయి.

దీంతో బెండ దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది. """/" / కాబట్టి బెండ పంటను సాగు చేసే రైతులు ( Farmers ) అందుబాటులో ఉండే తెగులు నిరోధక విత్తన రకాలను మాత్రమే ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.

పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఈ పురుగుల ఉనికి గుర్తించేందుకు ఆకు కింద ఓ తెల్ల కాగితం ఉంచి ఆకును ఉపాలి.

ఈ పురుగులు ఆశించిన మొక్కలను లేదా ఆకులను తీసేయాలి.పొలంలో కలుపు సమస్య లేకుండా ఎప్పటికప్పుడు కలుపు తొలగించాలి.

సేంద్రీయ పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే తులసి, సోయాబీన్, వేప నూనెలతో చేసిన ద్రావణాన్ని ఉపయోగించి వీటి జనాభాను అరికట్టవచ్చు.

"""/" / వెల్లుల్లి టీ, దురదగొండి ముద్ద లేదా పురుగుమందు సబ్బు మిశ్రమాన్ని కూడా ఉపయోగించి వీటి జనాభాను అరికట్టవచ్చు.

రసాయన పద్ధతిలో ఈ సాలీడు పురుగులను అరికట్టాలంటే.ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల వెట్టబుల్ సల్ఫర్ ను కలిపి పిచికారి చేయాలి.

లేదంటే ఒక లీటర్ నీటిలో ఒక మిల్లీ లీటరు స్పిరో మెసిఫిన్ ను కలిపి పిచికారి చేయాలి.

అవసరం అయితే వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసి ఈ పురుగులను అరికట్టి పంటను సంరక్షించుకోవాలి.

రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్