Pigeonpea Crop : కంది పంటను శనగపచ్చ పురుగుల బెడద నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

ప్రధానమైన పప్పు దినుసుల పంటలలో కంది పంట( Pigeonpea Crop )కూడా ఒకటి.

కంది పంటకు తెగుళ్ల బెడద( Pests) కంటే చీడపీడల బెడద చాలా ఎక్కువ.

కాబట్టి కంది పంటను సాగు చేసే రైతులు పంటను ఏ ఏ దశలో చీడపీడలు ఆశిస్తాయో ముందుగా అవగాహన కల్పించుకున్న తర్వాతనే సాగు చేపట్టాలి.

"""/" / కంది పంటకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

సాగుకు పనికిరాని బీడు భూముల్లో కూడా కంది పంటను సాగు చేసి మంచి దిగుబడి పొందవచ్చు.

వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్ని, ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను శుభ్రం చేసి, నేల వదులుగా అయ్యేలాగా రెండు లేదా మూడుసార్లు దమ్ము చేసుకోవాలి.

ఎక్కువగా సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇవ్వాలి.ఒక ఎకరం పొలానికి ఐదు టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి పొలాన్ని కలియదున్నుకోవాలి.

8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులు వేసుకోవాలి.విత్తనాల విషయానికి వస్తే.

ఒక ఎకరం పొలానికి రెండు కిలోల తెగులు నిరోధక సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

విత్తనాలకు విత్తన శుద్ధి ( Seed Treatment)చేసుకుంటే నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం చాలా తక్కువ.

ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల థైరం తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

"""/" / కంది పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే శనగపచ్చ పురుగులు ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి.

ఎందుకంటే ఈ పురుగులు పంట పూత, కాయ దశలో ఉన్నప్పుడు పంటను ఆశిస్తాయి.

ఈ పురుగులు కాయలకు రంద్రాలు చేసి లోపల ఉండే గింజలను తినేస్తాయి.సకాలంలో ఈ పురుగులను గుర్తించలేక పోతే దిగుబడి సగానికి పైగా తగ్గుతుంది.

సేంద్రీయ పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే.ఒక లీటరు నీటిలో ఐదు శాతం వేప కషాయం కలిపి మొక్కల పూత పూర్తిగా తడిచేటట్టు పిచికారి చేయాలి.

రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే.ఒక లీటరు నీటిలో 2.

5 మి.లీ క్లోరిపైరిఫాస్ ను కలిపి పిచికారి చేయాలి.

పంట కాయ దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆశిస్తే.ఒక లీటర్ నీటిలో 1.

5 గ్రాముల క్వినలోఫాస్ ను కలిపి పిచికారి చేయాలి.

పిరమిడ్స్ ఎలా కట్టారో వివరించిన ఎన్నారై రీసెర్చర్..?